Brahmamudi Serial: కళ్యాణ్ కవితలు రాస్తూ తన రూమ్ లో బిజీగా ఉంటాడు. ఇక తోటి కోడలు పై అసూయతో రగిలిపోతున్న అనామిక..రూమ్ లోకి వెళ్లి భర్త కళ్యాణ్ ను చివాట్లు పెడుతుంది. కావ్య కూడా ఆఫీస్ కు వెళ్తుంది.. మీరు ఎందుకు వెళ్లట్లేదు అంటూ కళ్యాణ్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.
ఆఫీస్ కు వెళ్ళడానికి క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది కావ్య. ఇది చూసిన చిన్న అత్త ధాన్యలక్ష్మి నీకు షేర్ ఆటోల్లో వెళ్లడం అలవాటే కదా అని కావ్యను కామెంట్ చేస్తుంది. ఇదంతా విన్న కావ్య అత్త అపర్ణ.. నువ్వు ఈ ఇంటి వారసుడు భార్యవు.. క్యాబ్ లో వెళ్లాల్సిన అవసరం లేదని గట్టిగా బుద్ది చెప్తుంది ధాన్యలక్ష్మికి. ఆ తర్వాత అపర్ణ తన కారులో కావ్యను ఆఫీస్ కు పంపిస్తుంది.
అత్త కోడలికి సపోర్ట్ గా నిలవడం చూసి.. కోపంతో రగిలిపోతున్న ధాన్యలక్ష్మి భర్త ప్రకాశం దగ్గరకు వెళ్లి ఆరోపణలు చేస్తుంది. రాజ్ తో పాటు కోడలు కావ్యను కూడా ఆఫీస్ కు పంపిస్తుంది అంటూ భర్తతో గొడవ పడుతుంది. కళ్యాణ్ కూడా ఆఫీస్ కు వెళ్లాలని డిమాండ్ చేస్తుంది.
అత్త పంపిన కారులో గ్రాండ్ గా కావ్య ఆఫీస్ లో ముందు దిగుతుంది. ఈ విషయం తెలియని రాజ్ కొత్తగా వచ్చే ఆ మేడం ఎవరని వెనక్కి చూడగానే కావ్య కనిపిస్తుంది. మొదటి రోజు ఆఫీస్ కు వచ్చిన కావ్యకు స్టాఫ్ అంత పూల బొకేలతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. ఇది చూసిన రాజ్ ఆశ్చర్యపోయి నిలబడతాడు.
మొదటి రోజు ఆఫీస్ కు వచ్చిన కావ్యకు స్టాఫ్ అంత పూల బొకేలతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. ఇది చూసిన రాజ్ ఆశ్చర్యపోయి నిలబడతాడు.
ఆఫీస్ లో ఉన్న రాజ్ కు సడెన్ గా శ్వేతా నుంచి ఫోన్ వస్తుంది. హడావిడిగా రాజ్ బయలుదేరడం గమనించిన కావ్య భర్తను ఫాలో చేస్తుంది. శ్వేతా ఇంటికి వెళ్లిన రాజ్ తనతో దగ్గరగా ఉండడం.. కిటికీలో నుంచి చూసిన కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్