Brahmamudi Serial: రాజ్ కొంపలో కుంపటి పెట్టిన రుద్రాణి.. భర్త కోసం కుమిలిపోతున్న కావ్య..! భర్త రాజ్ శ్వేతతో ఉండటం చూసి కావ్య తట్టుకోలేకపోతుంది. ఏడుస్తూ భర్త గురించి దిగులుపడుతుంటుంది. మరోవైపు అప్పు ఏమో కళ్యాణ్ ఫొటోలు, అతడు ఇచ్చిన చీరను మంటల్లో పడేస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. By Jyoshna Sappogula 23 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Serial: కావ్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ రోజు వంట పనులన్నీ ధాన్యలక్ష్మికి అప్పగిస్తుంది ఇంటి పెద్ద ఇందిరాదేవి. ఇంట్లో ఎప్పుడెప్పుడూ చిచ్చుపెడుదామా అని వేయిట్ చేస్తు ఉంటుంది అత్త రుద్రాణి. ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఇంట్లో వాళ్లు నీ కొడుకు కళ్యాణ్ కు అసలు గౌరవం ఇవ్వడం లేదని కూలీ వాడిలా ఇంట్లో పనులు చెబుతున్నారని రెచ్చగొడుతుంది. అనామికకు హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ తన కొడుక్కి ఆస్తిలో వాటా వచ్చేలా ప్లాన్స్ వేస్తు ఉంటుంది. తట్టుకోలేకపోయిన కావ్య.. ఇదిలా ఉండగా భర్త రాజ్ శ్వేతతో (Swetha) హాస్పిటల్ లో ఉండటం చూసిన కావ్య తట్టుకోలేకపోతుంది. డాక్టర్స్‌కు రాజ్ తనకు కాబోయే భర్త అని శ్వేత చెప్పడంతో ఆ మాట నర్సుల ద్వారా విన్న కావ్య (kavya) కన్నీళ్లు పెట్టుకుంటుంది. భర్త రాజ్ తన నుండి విడిపోయి శ్వేతను పెళ్లి చేసుకుంటాడేమో అని తనలో తను బాధ పడుతూ ఉంటుంది. ఎప్పుడూ ఈ ఆలోచనలతో ఉండటంతో సరిగ్గా నిద్ర లేక నిరసంగా ఉంటుంది. Also Read: హనుమాన్ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్ రాజ్ రాముడే.. కానీ, రాజ్ రాముడని క్లియర్ గా అర్థమవుతుంది. శ్వేతను కేవలం ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాడు తప్ప..వేరే ఏ రిలేషన్ ఉండదూ.. హాస్పిటల్ లో కావాలనే రాజ్ నాకు కాబోయే భర్త అని శ్వేత అబద్ధం చెబుతుంది. ఎందుకంటే తన చేతికి గాయం అవ్వడంతో మళ్లీ పోలీస్ కేస్ అంటూ ఇబ్బంది పెడతారని అలా చెబుతుంది. పాపం అసలు నిజం తెలియని కావ్య భర్త కోసం ఆవేదన చెందుతుంది. కనకం షాక్ ఇదిలా ఉండగా, కృష్ణమూర్తి తనకొచ్చిన బొమ్మల తయారి కాంట్రాక్ట్ ను ఎలా పూర్తి చేయాలా? అని ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంటాడు. చలి మంట వేసుకుని అందరూ బయట ఉండగా అప్పుడె వచ్చిన అప్పు.. కళ్యాణ్ ఫొటోలు, అతడు ఇచ్చిన చీరను మంటల్లో పడేస్తుంది. ఆమె చేసిన పని చూసి కనకం, కృష్ణమూర్తి ఒక్కసారిగా షాకవుతారు. నా లైఫ్‌లో కవి అనేటోడు లేడని.. మీరు, పెద్దమ్మతో పాటు కావ్య అక్క తప్ప ఎవరూ నాకు అక్కరలేదని అంటుంది. ఇంటి కోసం నేనే ఏదో ఒకటి చేస్తా అని తల్లిదండ్రులకు మాటిస్తుంది. కావ్యను పట్టించుకోని రాజ్ డిన్నర్ దగ్గర అందరికి చిన్న కోడలు అనామిక భోజనం వడ్డిస్తుంటుంది. అప్పుడే వచ్చిన రాజ్ కావ్య ఎక్కడ అని అడుగుతాడు. కావ్యకు ఏమైందో నీకు తెలియదా? తను నిరసంగా ఉందని రాజ్‌తో అంటుంది ఇందిరాదేవి. భర్తగా కావ్యను చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది..ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా అని క్లాస్ ఇస్తుంది. తాను హాస్పిటల్ తీసుకొని వెళ్లానని స్వప్న చెబుతుంది. ఇందిరాదేవి, స్వప్న చెప్పిన మాటలకు రాజ్ భోజనం చేయకుండానే కావ్య దగ్గరికి వెళ్లిపోతాడు. Also Read: ఓటీటీలో వెంకటేష్ “సైంధవ్” సందడి.. స్ట్రీమింగ్ డేట్ ఆ రోజే ..? #brahmamudi-serial-latest-episode #brahmamudi-serial #brahmamudi-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి