Brahmamudi Serial: కావ్యకు రాజ్ విడాకులు.. ఇంట్లో రూ.2 లక్షల దొంగతనం పై ధాన్యలక్ష్మి రచ్చ భర్త రాజ్ విడాకులు ఇస్తానని చెప్పడంతో.. కావ్య ఏడుస్తూ పుట్టింటిలో ఉంటుంది. మరో వైపు రాజ్ ఇంటికి రాగానే కావ్య రూ.2 లక్షలు దొంగతనం చేసిందనే .. నిందను మోపుతుంది ధాన్యలక్ష్మి. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. By Archana 14 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Serial Today Episode: రాజ్ విడాకులు ఇస్తానని చెప్పడంతో.. మనసు ముక్కలైన కావ్య బాధతో పుట్టింటికి బయలుదేరుతుంది. దారి మధ్యలో కారు చెడిపోవడంతో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అదే దారిలో వచ్చిన రాజ్ (Raj) కావ్యను డ్రాప్ చేస్తాని.. పుట్టింటికి తీసుకెళ్తాడు. ఇంటి ముందు కావ్య (Kavya), రాజ్ ను చూసిన కనకం.. రాజ్ ను లోపలి రమ్మని పిలుస్తుంది. కానీ రాజ్ మాత్రం పని ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. కావ్య లోపలకి రాగానే.. అక్క బాధగా ఉండడం గమనించిన అప్పు ఏమైందని అడుగుతుంది. అల్లుడు గారు కూడా అర్థం కానట్లు మాట్లాడి వెళ్లిపోయారు.. నువ్వేమో మౌనంగా ఉన్నావు అని కావ్యను నిలదీస్తుంది కనకం. ఇక కావ్య ఏడుస్తూ మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తున్నారు అమ్మ అని చెబుతుంది. ఇది వినగానే కనకం, మూర్తి, అప్పు షాకవుతారు. కోపంతో రగిలిపోతున్న అప్పు .. ఇప్పుడే వెళ్లి బావను నిలదీస్తాను.. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్దాం అని చెబుతుంది. కానీ కావ్య మాత్రం.. నా పై ఆయనకు ఇష్టమే లేనప్పుడు ఏం చేసిన లాభమేంటని బాధపడుతుంది. Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..! మరో వైపు రాజ్ ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి డబ్బుల దొంగతనం గురించి పంచాయతీ పెడుతుంది. ఇంటి తాళాలు చేతికి రాగానే నీ భార్య రెండు లక్షలు దొంగతనం చేసిందని రాజ్ కు చెప్తుంది. రాజ్ మాత్రం కావ్య అలంటి పని అస్సలు చేయదు. కావ్యను అనే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు అని ధాన్యలక్ష్మికి పై కోప్పడి.. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ధాన్యలక్ష్మి ప్రవర్తనకు విసిగిపోయిన ప్రకాశం.. మరోసారి ఇంటి కోడల్ని దొంగ అంటే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తాడు. ఇటు రుద్రాణి మాత్రం ధాన్యలక్ష్మిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటు పుట్టింటికి వెళ్లిన కావ్య ఏడుస్తూ కూర్చుంటుంది. అక్క బాధను చూసిన అప్పు ఏడిస్తే సరిపోదు.. సమస్యను ఎదురించి పరిష్కరించుకోవాలి అని చెప్తుంది. దానికి కావ్య ఆస్తి, హక్కులు కాదు బలవంతంగా తీసుకోవడానికి.. ప్రేమ అని చెప్తుంది. అందుకే రాజ్ జీవితం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాని చెబుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి.. తప్పుకొని.. నువ్వు తప్పు చేసిన దానిగా మిగిలిపోతావా..? అని కావ్యను ప్రశ్నిస్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Brahmamudi Serial Also Read: Naga Chaitanya: బుజ్జితల్లి.. వచ్చేస్తున్నా కదే.. చైతన్య, సాయి పల్లవి రీల్ వైరల్! #brahmamudi-serial #brahmamudi-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి