Brahmamudi Serial : వెన్నెల కోసం కావ్య, శ్వేత మాస్టర్ స్కెచ్.. రాజ్ గుట్టు బయట పడనుందా..?

పదవి, అధికారం కంటే బిడ్డనే ముఖ్యమని భావించిన రాజ్ కంపెనీ ఎండీ బాధ్యతలను కళ్యాణ్ కు అప్పగిస్తాడు. మరో వైపు రాజ్ స్నేహితురాలు శ్వేతతో కలిసి బాబు తల్లి వెన్నెలను పట్టుకోవాలని ప్లాన్ వేస్తుంది కావ్య. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial : వెన్నెల కోసం కావ్య, శ్వేత మాస్టర్ స్కెచ్.. రాజ్ గుట్టు బయట పడనుందా..?

Brahmamudi Serial Today Episode : బిడ్డ కోసం రాజ్(Raj) దుగ్గిరాల వారసుడి స్థానాన్ని, కంపెనీ బాధ్యతలను వదులుకోవడానికి సిద్ధపడతాడు. కానీ రాజ్ నిర్ణయాన్ని భార్య కావ్య(Kavya) వ్యతిరేకిస్తుంది. దీంతో రాజ్.. నువ్వు కూడా నా నిర్ణయాన్ని అడ్డుకుంటున్నావా కళావతి(Kalavathi) అని అంటాడు. దానికి కావ్య.. ఆ బిడ్డ కోసం ఇంత మంచి కుటుంబాన్ని కోల్పోతున్నారు ఒక సారి ఆలోచించండి అని భర్తకు స‌ర్ధిచెబుతుంది.

Raj - Kavya

ఆ తర్వాత కావ్య.. ఆ బిడ్డ తల్లి ఎవరో తీసుకొచ్చి అసలు నిజం బయట పెట్టండి అని రాజ్ ను నిలదీస్తుంది. ఒక వేళ మీరు నిజంగానే తప్పు చేశారని రుజువైతే.. మీ జీవితంలో నుంచి నేనే తప్పుకుంటాను. అప్పుడు మీ గౌర‌వం మీకు ద‌క్కుతుంది. మీ బిడ్డ‌కు కూడా దుగ్గిరాల వంశ వార‌స‌త్వం దొరుకుతుంద‌ని భ‌ర్త‌ రాజ్ తో అంటుంది కావ్య‌.

Raj - Kavya
ఇక ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పిన రాజ్.. తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోడు. స్థానం, పదవి, స్థాయి కోసం రక్త సంబంధాన్ని వదులుకోలేనని తెగేసి చెప్తాడు రాజ్. ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకోని.. కళ్యాణ్ పేరు పై పవర్ ఆఫ్ అటార్నీ రాయాలని పేపర్స్ పై సంతకం చేయడానికి సిద్దమవుతాడు.

Raj - Kalyan
ఇంతలో సీతారామయ్య.. వచ్చి రాజ్ ను ఆపుతాడు. నీకు ఏమంత వయసు అయిపోయిందని ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకుంటున్నావ‌ని రాజ్‌ను నిల‌దీస్తాడు. ఈ సంత‌కం వ‌ల్ల ఎంత అన‌ర్థం జ‌రుగుతందో అలోచించావా అని మనవడిని మందలిస్తాడు. ఇక రాజ్ ఏ మాత్రం వినిపించుకోకుండా సంతకం చేస్తాడు.

Sitaramayya
మరో వైపు కావ్య వెన్నెల(Vennela) ను ఎవరో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. రాజ్ తో పాటు చదివిన వారి వివరాలు మొత్తం సంపాదిస్తుంది. అయితే అందులో శ్వేత(Swetha) అనే పేరు కూడా ఉంటుంది. దీంతో అది.. రాజ్ ఫ్రెండ్ శ్వేత అయి ఉండవచ్చని ఊహించిన కావ్య.. ఆ నెంబర్ కాల్ చేస్తుంది. కావ్య అంచ‌నా నిజం అవుతుంది. శ్వేత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.

Vennela - Swetha - Kavya
ఫోన్ లిఫ్ట్ చేయగానే కావ్య కంగారుగా మాట్లాడడంతో శ్వేత కంగారు పడుతుంది. దీంతో కావ్య.. భ‌య‌ప‌డాల్సిందేమి తాను చెప్పిన అడ్రెస్స్ కి రమ్మని చెప్తుంది.

Kavya - Swetha
ఇక ఎండీ గా బాధ్యతలను చేపట్టిన కళ్యాణ్ ఆఫీస్ లో అడుగుపెడతాడు. కళ్యాణ్ తో పాటు రాహుల్ కూడా వస్తాడు. లోపలికి వెళ్లిన కళ్యాణ్.. రాజ్ కుర్చీలో కూర్చోవడానికి ఒప్పుకోడు. ఆ చైర్ ఎప్పుడూ అన్నయ్యదే అని స్టాఫ్ తో చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Kalyan - Rahul

Also Read: HBD Allu Arjun: బన్నీకి డేవిడ్ వార్నర్ స్పెషల్ విషేష్.. ఇంకా ఎవరెవరు ట్వీట్ చేశారంటే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు