Brahmamudi Serial : సుభాష్ బయటపెట్టే నిజం కావ్య కాపురాన్ని నిలబడుతుందా..? రాహుల్ తన భార్య స్వప్నకు తెలియకుండా ఆమెకు సంబంధించిన ఆస్తి పేపర్లను వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెడతాడు. మరో వైపు కావ్య బిడ్డ గురించి నిజం బయటపెట్టమని మావయ్య సుభాష్ ను నిలదీస్తుంది. కానీ అతను సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 22 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Serial Today Episode 2024 : స్వప్న(Swapna) కు సీతారామయ్య(Sita Ramaiah) రాసిచ్చిన ఆస్తిని కాజేయాలని ప్లాన్ వేసిన రాహుల్(Rahul) భార్యకు తెలియకుండా ఆస్తి పేపర్లను వడ్డీ వ్యాపారి దగ్గర పెడతాడు. కోటీ 25 లక్షలు అప్పు తీసుకున్నట్లుగా అతనితో నాటకం ఆడించాలని ప్లాన్ వేస్తాడు. మరో వైపు కావ్య(Kavya) బిడ్డ విషయంలో భర్త రాజ్(Raj) దాస్తున్న రహస్యాన్ని ఎలాగైనా మావయ్య సుభాష్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటుంది. నిజం తెలుసుకోవడానికి సుభాష్ దగ్గరికి వెళ్లిన కావ్య.. ఏంటీ మావయ్య ఆయన గురించి ఆలోచిస్తున్నారా..? మీరు అనుకుంటే ఆయన ఇంటి నుంచి వెళ్లకుండా ఆపగలరు. బిడ్డ గురించి మీకు అంతా తెలుసు. మీరు, ఆయన మాట్లాడుకోవడం నేను విన్నాను అని చెబుతుంది. కావ్య అలా చెప్పగానే సుభాష్ షాకవుతాడు. దాంతో కావ్య ఆయన్ను ఎలా కాపాడాలి అని నేను ఆలోచిస్తుంటే.. మీరు నిజం తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అని సుభాష్ ను నిలదీస్తుంది. ఆ నిజమేంటో నాకు చెప్పండి అని అంటుంది. దానికి సుభాష్ చెప్పలేనమ్మా , నిజం చెప్పేదే అయితే రాజ్ చెప్పేవాడు కదా అని అంటాడు. దాంతో కావ్య మీరు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అని సుభాష్ చేయి తల పై పెట్టుకుంటుంది. ఇక సుభాష్ రాజ్ కూడా నీలానే చెప్పొద్దని మాట తీసుకున్నాడు అని నిజం చెప్పకుండా దాటేసే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత రాజ్ గదిలో ఒంటరిగా తల్లి అపర్ణ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య రూమ్ కి వస్తుంది. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే.. భర్త లేని కోడలిగా ఈ ఇంట్లో ఉండాలా..? లేదా మీతో పాటు వచ్చేయాలా..? మీ అమ్మగారు మాట్లాడేటప్పుడు మీకు నేను గుర్తుకు రాలేదా అని భర్తను ప్రశ్నిస్తుంది కావ్య. మరో వైపు రాహుల్, రుద్రాణి ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బును చూసి మురిసిపోతూఉంటారు. ఇంతలో స్వప్న రాగానే ఇద్దరు కంగారు పడతారు. దీంతో స్వప్న మళ్ళీ ఏం తప్పు చేశారు అంటూ నిలదీస్తుంది. ఏమి లేదని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు రాహుల్, రుద్రాణి. మరుసటి రోజు సీతారాముల కళ్యాణం జరిపించాలని దుగ్గిరాల ఇంటికి పంతులు వస్తారు. ప్రతీ యేటా మీ కుటుంబీకులే కళ్యాణం జరిపిస్తారు. కానీ ఈ సారి ఎలాంటి కబురు లేకపోవడంతో ఇంటికి వచ్చానని చెబుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read: Hanuman 100 Days: 100 డేస్ థియేట్రికల్ రన్.. ‘హనుమాన్’ సంచలనం..! #brahmamudi-serial #tv-serial #daily-serial #brahmamudi-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి