Brahmamudi Serial : చిచ్చు పెట్టిన రుద్రాణి.. రెచ్చిపోతున్న ధాన్యలక్ష్మి.!

ఇంట్లో పూజకు కావ్య అంతా సిద్ధం చేస్తుండగా రుద్రాణి వచ్చి దీపపు కుందీని కిందపడేస్తుంది. కావ్య కావాలనే ఇలా చేసిందంటూ రెచ్చగొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ అరిష్టం అంటూ కావ్యను నానా మాటలు తిడుతుంది. మరోవైపు అప్పుకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటారు కుటుంబసభ్యలు.

New Update
Brahmamudi Serial : చిచ్చు పెట్టిన రుద్రాణి.. రెచ్చిపోతున్న ధాన్యలక్ష్మి.!

Brahmamudi Serial Today Episode :  బ్రహ్మముడి(Brahmamudi) సీరియల్ లో హీరోయిన్ చెల్లి అప్పు(Appu) కి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తారు తండ్రి కృష్ణమూర్తి, తల్లి కనకం. ఎప్పుడు డబ్బు ఉన్నవాళ్ల ఇంటికి కూతుర్లను పంపించాలని ఆలోచించే కనకం కొత్తగా అబ్బాయి మంచివాడు అయితే చాలు.. మా అప్పును ప్రేమగా చూసుకుంటే చాలు అని అంటుంది. అయితే, పెళ్లి సంబంధాలు చూసినందుకు మ్యారేజ్ బ్రోకర్(Marriage Broker) ను పరిగెత్తించి కొడుతుంది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని తేల్చి చెబుతుంది.

Appu

రెచ్చిపోతున్న ధాన్యలక్ష్మి

కావ్య(Kavya) సత్యనారాయణ పూజకు ఇంట్లో అన్ని సిద్ధం చేస్తుంటుంది. అయితే, అత్త రుద్రాణి(Rudhrani) అక్కడికి వచ్చి దీపపు కుందెను కింద పడేసి కావ్యనే చేసిందని నింద వేస్తుంది. అప్పుడే వచ్చిన ధాన్యలక్ష్మీ కావ్యపై ఫైర్ అవుతుంది. ఈ మహా తల్లి అడుగుపెట్టింది అరిష్టం జరిగిందంటూ నానా మాటలు తిడుతుంది. నా కొడుకు కోడలు పూజ చేయడం నీకు ఇష్టం లేదు.. అందుకే ఇలా చేశావని మండిపడుతుంది. అయితే, కావ్యను ఎప్పుడు ప్రేమగా చూసుకునే ధాన్యలక్ష్మీ ఇప్పుడు కావ్యపై రెచ్చిపోతోంది.

Aparna v/s Kavya

కావ్యకు అండగా నిలిచిన అక్క

ఈ మధ్య కావ్యకు తెగ సపోర్టు చేస్తోంది అక్క స్వప్న(Swapna). ఎప్పుడూ తన స్వర్థం చూసుకునే స్వప్న ఇంట్లో అందరిని ఎదురిస్తూ కావ్యకు అండగా నిలుస్తుంది. ధాన్యలక్ష్మీ ను తిడుతుండగా స్వప్న ఎంటరై.. మా అత్త తో పూజ చేయించండి. తనంతా ముత్తైదువు ఈ ప్రపంచంలోనే లేదు.. గ్లామర్‌గా రెడీ అయి పూజ చేస్తుంది. తన ఐరన్ హ్యాండ్‌తో పూజా చేస్తే అంతా మంచిగా జరుగుతుందంటూ కౌంటర్ వేస్తుంది. జస్ట్ షటప్ అంటూ రుద్రాణి అరుస్తుంది.

Brahmamudi Serial Today Episode

పూజ చేయడం ఇష్టం లేదన్న అనామిక

ఇంట్లో అందరూ కావ్యను తిడుతుంటే రాజ్ వాళ్ల నాన్న, నాన్నమ్మ కావ్యకు సపోర్ట్ చేస్తారు. కావ్య పొద్దున్నే లేచి అంతా రెడీ చేస్తుంటే..మీరేమో పట్టు చీరలు, నగలు అంటూ ఇప్పుడు వచ్చి చిన్న పొరపాటు జరిగితే కావ్యను తిడుతారా? అంటూ రుద్రాణిని, ధాన్యలక్ష్మీని, అపర్ణను తిడుతారు. ఆ తరువాత కళ్యాణ్ అనామిక తోపాటు కావ్య రాజ్, స్వప్న రాహుల్ ను కూడా పూజలో కూర్చోవాలని చెబుతారు. కానీ, అనామిక కావ్య వాళ్ళతో పూజ చేయడం ఇష్టం లేదని ధాన్యలక్ష్మీకి చెబుతుంది.

Also Read:మహేష్ ఫాలోయింగ్ పై నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. మీరొక ఎమోషన్‌ అంటూ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు