ఉగాది తర్వాత టీడీపీ కనుచూపు మేరలో కనిపించదు...మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు... !

జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. చర్చలు సుహృద్బావ వాతావరణంలో జరిగాయని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. మరికొన్ని అంశాలను చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయన్నారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ తిరుగుతున్నాడని అన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడన్నారు.

New Update
Minister Botsa: బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ.. మూడు ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాల్లో మంత్రి బలగం!

జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. చర్చలు సుహృద్బావ వాతావరణంలో జరిగాయని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. మరికొన్ని అంశాలను చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయన్నారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ తిరుగుతున్నాడని అన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడన్నారు.

సీఎం జగన్ పై చంద్రబాబు నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపు మేరలో కనపడదన్నారు. చంద్రబాబు ఓ ముసలి జిత్తుల మారి నక్క అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలని సూచించారు.

మాజీ సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి? అని ప్రశ్నించారు. మనిషికి వయసు రాగానే కాదన్నారు. పరిపక్వత ఉండాలన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పారు. ఎన్నికల ప్రజాక్షేత్ర౦లో ఎవరి సత్తా ఏంటో తేలుతుందన్నారు. చంద్రబాబు లాంటి దుష్ట శక్తులు రాష్ట్ర అభివృద్ధి ని అడ్డుకుంటున్నాయంటూ తీవ్రంగా మండిపడ్డారు.

ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తామన్నారు. సీఎం జగన్ తెచ్చిన సంక్షేమ పథకాల వల్లే తాము ధైర్యంగా ఈ మాట చెబుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా కొట్టుకుపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఉద్యోగులకు వైసీసీ సర్కార్ పూర్తిగా అండగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. వాళ్లకు ఎలాంటి సమస్యలు వున్నా తమ దృష్టికి తీసుకు వస్తే చర్చించి వాటిని పరిష్కరిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు