Boora Narsaiah Goud: వీరేశం వస్తే స్వాగతిస్తాం

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీజేపలోకి వస్తే స్వాగతిస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. నకిరేకల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించరన్నారు.

New Update
Boora Narsaiah Goud: వీరేశం వస్తే స్వాగతిస్తాం

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీజేపలోకి వస్తే స్వాగతిస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. నకిరేకల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించరన్నారు. జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ బలపడటం కోస తాను ఎంతో కృషి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. చివరకు తనకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం పార్టీ కోసం కష్టపడ్డారన్నారు.

పార్టీ బలపడటం కోసం నకిరేకల్‌ నియోజకవర్గంలో అహర్షిశలు పనిచేశారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్‌ అలాంటి వారిని పట్టించుకోరన్నారు. వేముల వీరేశం బీజేపీలోకి వస్తే తాము స్వాగతిస్తామని, అంతే కాకుండా నకిరేకల్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దిత్వంపై చర్చిస్తామన్నారు. మరోవైపు వీరేశం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకి చెందిన జిల్లా పెద్దలతో సైతం ఆయన మంతనాలు జరిపారు. దీంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇటీవల నకిరేకల్‌ నియోజవర్గ కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైయ్యారు.

వేముల వీరేశం పార్టీలో చేరితే జరిగే ప్రయోజనం గురించి వారికి వివరించారు. అయితే వీరేశం చేరుకను కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాలుగా తాము పార్టీ కోసం కష్ట పడ్డామని, ఇప్పుడు నష్టమైనా లాభమైనా తామే భరిస్తామని అంతేకానీ వీరేశాన్ని కాంగ్రెస్‌లో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరేశం పార్టీలో చేరితే తాము అతనికి సహకరించేది లేదని తేల్చి చెప్పినట్లు రాజకీయవర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు