నా దృష్టిలో అది తప్పు.. కానీ నేటి తరానికి చాలా అవసరం: త్రివిక్రమ్

పుస్తకాలు చదవడం వల్ల మనిషి ఆలోచన పెరుగుతుందంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. రీసెంట్ గా ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన.. బుక్స్ చదవడం వల్లే తనలో ఊహించని మార్పులొచ్చాయని చెప్పారు. పుస్తకాన్ని మించిన ఉలి ఉండదు. రాయిలాంటి మనిషిని కూడా శిల్పంలా మారుస్తుందన్నారు.

నా దృష్టిలో అది తప్పు.. కానీ నేటి తరానికి చాలా అవసరం: త్రివిక్రమ్
New Update

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బుక్ రీడింగ్ హాబిట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వెల్లడించారు. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన ఆయన.. సినిమా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాల్లో వేదికలపై ఆయన ఇచ్చే స్పీచ్‌కు కూడా చాలా మంది అభిమానులుంటారు. సోషల్ మీడియాలోనూ ఆయన మాటలు తెగ షేర్‌ అవుతూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడల్లా పుస్తకం గొప్పతనాన్ని చెప్పే త్రివిక్రమ్‌ మరోసారి తన మాటలతో ఆకట్టుకున్నారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పుస్తకం విలువను తెలియజేశారు.

Also read :మరో మూడేళ్లు కేసీఆర్ఏ సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు

ఈ మేరకు టెక్నాలజీతో పాటు ముందుకు వెళ్లాలని.. పుస్తకాలు చదివితే మనం వెనక్కు వెళ్తామని అందరూ అనుకుంటారు. కానీ, అది నా దృష్టిలో తప్పు. మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్కవాళ్లతో మాట్లాడతాం. అదే.. పుస్తకం చదివేటప్పుడు మాత్రం పక్కవాళ్లతో మాట్లాడడానికి కుదరదు అన్నారు. అప్పుడు మనతో మనమే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం నేటి తరానికి చాలా అవసరం. అప్పుడే మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానంలో మార్పు వస్తుంది. అవతలి వారు నొచ్చుకోకుండా మాట్లాడగలుగుతాం. సోషల్‌ మీడియాలో చాలామంది అవతలి వారిని బాధపెట్టేలా కామెంట్స్‌ చేస్తుంటారు. ఆ విషయం కామెంట్‌ చేసిన వాళ్లే తెలుసుకోలేకపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందంటే.. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించే లక్షణం మనుషుల్లో తగ్గిపోయింది. చదవడం వల్ల ఆ ఆలోచన పెరుగుతుంది. అప్పుడు మనం ఉన్నతమైన వ్యక్తిగా మారతాం. నేను చదివిన చాలా పుస్తకాలు నాలో మార్పు తీసుకువచ్చాయి. పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని కూడా పుస్తకం శిల్పంలా మారుస్తుంది. చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి’ అంటూ పుస్తకం గొప్పతనాన్ని చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ తీస్తున్నారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న ఇందులో శ్రీలీల కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

#trivikram-srinivas #books #changed-life
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe