Boneykapoor: నటిని అక్కడ టచ్ చేసిన బోనీ కపూర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

బోనీ కపూర్‌ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆయన నటి ప్రియమణి నడుముని పట్టుకోవడమే. దీంతో ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లలు ఉన్న వ్యక్తి అంత నీచంగా ఎలా ఉంటాడు? చాలా సిగ్గుపడాల్సిన విషయం అంటూ నెటిజన్లు రాసుకొచ్చారు.

New Update
Boneykapoor: నటిని అక్కడ టచ్ చేసిన బోనీ కపూర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Boney kapoor: ఆలనాటి అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆయన ఓ నటి నడుముని పట్టుకోవడమే. దీంతో ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం సాయంత్రం ముంబైలో బి-టౌన్ సెలబ్రిటీల కోసం ‘మైదాన్’ మూవీ స్క్రీనింగ్ జరిగింది.

ఈ సమయంలో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ సహా సినిమా యూనిట్ అంతా కార్యక్రమానికి హాజరైంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి ప్రియమణి (Priyamani)  చీరలో అందంగా మెరిసింది. బోనీ కపూర్ ప్రియమణికి స్వాగతం పలికారు. ఇక అదే సమయంలో ఫొటోగ్రాఫర్ లు ఫొటోలకు పోజులివ్వమని అడిగారు. దీంతో బోనీ , ప్రియమని ఇద్దరు కూడా ఫొటోలకు పోజులిస్తుండగా, బోనీ ప్రియమణి, భుజం సహా నడుముపై చేయి వేశారు.

ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వాటిని చూసిన నెటిజన్లు బోనీ ప్రియమణి నడుమును కావాలనే తాకినట్లు ఆయనను టార్గెట్‌ చేశారు. బోనీ చేసిన పనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ అంత పెద్ద మనిషి ఒక నటితో ఇలా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదని అన్నాడు. మరొకరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వ్యక్తి అంత నీచంగా ఎలా ఉంటాడు? ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని రాసుకొచ్చారు.

మహిళలను అనుచితంగా తాకినట్లు నెటిజన్లు బోనీని విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు.

Also read: రథోత్సవంలో అపశ్రుతి.. 15 మంది చిన్నారులకు విద్యుదాఘాతం!

Advertisment
తాజా కథనాలు