రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారు.... బొండా ఉమా ఫైర్...!

రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. ఇసుకలో వైసీపీ నేతలు రూ. 40 వేల కోట్లు దోచేశారని ఆయన మండిపడ్డారు. మద్యం పేరిట రూ. 50 వేల కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...

New Update

వైసీపీ నేతల ఇసుక దోపిడీకి నిరసనగా 66 ఇసుక రీచ్ ల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఈ రోజుల్లో కూరగాయల బండ్ల వద్ద కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయని అంటున్నారు. అలాంటిది మద్యం షాపులో ఎందుకు ఉండటం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్య మంత్రి మాత్రమే సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ఒక బటన్ ద్వారా పది రూపాయలు ఇస్తూ ఇంకో బటన్ ద్వారా వంద రూపాయలు లాగేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకటో తారీకు వస్తే పేదలంతా వణికి పోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోనూ టీడీపీ శ్రేణులు సత్యాగ్రహ దీక్ష చేశాయి. రాష్ట్రంలో ఇసుకను దోచేస్తున్న వైసీపీ.. ఇసుక మాఫియా అంటూ బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు.

అనంతరం పెనుగొండ తాసిల్దార్ కు  వినతి పత్రాన్ని అందజేశారు. చంద్రబాబు హయాంలో ఇసుక ఐదు యూనిట్లు రూ. 7 వేలు ఉండేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల నాయుడు అన్నారు. కానీ నేడు జగన్ హయాంలో ఇసుక 5 యూనిట్లు రూ. 25 వేల నుండి 40 వేల వరకు ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజలను పీల్చుకుని తింటున్నాడంటూ మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు