Mumbai High Court : నకిలీ సర్టిఫికేట్లతో చదివితే ఏం.. అసలే డాక్టర్ల కొరత.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు! నకిలీ సర్టిఫికేట్ తో ఎంబీబీఎస్ చదివిన ఓ స్టూడెంట్ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారత్ లో జనాభాకు సరిపడ డాక్టర్లు లేరని..ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ను రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు నిర్ణయాత్మక తీర్పునిచ్చింది. By Bhavana 15 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Duplicate Certificates : నకిలీ సర్టిఫికేట్ తో ఎంబీబీఎస్(MBBS) చదివిన ఓ స్టూడెంట్ కేసులో ముంబై హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పు ఇచ్చింది. భారత్(India) లో జనాభాకు సరిపడ డాక్టర్లు లేరని..ఇప్పుడు ఆ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ను రద్దు చేయడం కుదరదని ముంబై హైకోర్టు నిర్ణయాత్మక తీర్పునిచ్చింది. మహారాష్ట్ర సియోన్ లోని లోకమాన్య తిలక్ మెడికల్ కాలేజీలో లుబ్నా ముజావర్ అనే స్టూడెంట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ చూపించి అడ్మిషన్ పొందాడు. ఆయన తండ్రి, తల్లికి తలాక్ చెప్పినందున ఇంకమ్ సర్టిఫికేట్ లో రూ.4.5లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని ఉన్నట్లు చూపించాడు. వాస్తవానికి అతని తల్లి మునిసిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి. ఆ విషయాన్ని అప్లికేషన్ లో దాచిపెట్టాడు2012లో టాప్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. తర్వాత 2017లో తన MBBS డిగ్రీ కూడా పూర్తైంది. మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డు 2012లో నాన్ క్రిమిలేయర్ స్టరిఫికేట్ ఆదారంగా OBC లకు వచ్చిన MBBS అడ్మిషన్లపై ముంభై హైకోర్టు విచారణ జరిపింది. ఆ కేసు విచారణలో ముంభై హైకోర్టు 3 నెలల్లోగా కోర్సు కోసం ఓపెన్ట కేటగిరి చెల్లించాల్సిన ఫీజుతో పాటు రూ.50వేలు చెల్లించాలని విద్యార్థికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. MBBS సర్టిఫికేట్ రద్ధు చేయాలన్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భారత్ లో ఇప్పటికే వైద్యుల కొరత ఎక్కువగా ఉందని..కేవలం ఫేక్ సర్టిఫికేట్(Fake Certificate) తో తెచ్చుకున్న అడ్మిషన్ వల్ల సర్టిఫికేట్ ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. Also read: భోజనానికి ముందు కానీ, తరువాత కానీ…టీ , కాఫీలు తాగుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త! #bombay-high-court #fake-certificates #mbbs #doctors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి