/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-16T201139.692-jpg.webp)
Hanuman Movie Director Prasanth Varma: ‘హనుమాన్’తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. బీ టౌన్ బడా ప్రొడక్షన్ కంపెనీల నుంచి పిలుపు వస్తున్నట్లు తెలుస్తోంది. రూ.300 కోట్లు కలెక్ట్ చేసిన హనుమాన్ సినిమా సీక్వెల్ 'జై హనుమాన్' తెరకెక్కించే పనిలో ఉండగానే.. నార్త్ హీరోలు సైతం ఆయనకు అవకాశం ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
Wishing my Super Hero @TejaSajja123
Super talented @Karthik_gatta & Super passionate @vishwaprasadtg garu all the best for #PMF36 🤗Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 #SuperYodha 🥷 pic.twitter.com/aOqpz1z08E
— Prasanth Varma (@PrasanthVarma) April 15, 2024
రణవీర్ సింగ్ తో సినిమా..
ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) తో ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయనున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా బిటౌన్ లో ఈ న్యూస్ జోరుగా ప్రచారంలో ఉంది. మైథలాజికల్ యాక్షన్ డ్రామా కథని ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ కి ఇప్పటికే నేరేట్ చేసాడని, త్వరలో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందనే టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం రణవీర్ సింగ్ డాన్ 3 మూవీలో చేస్తున్నాడు. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో మరో సినిమా రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రశాంత్ వర్మ కథ విన్నప్పటికి ఫైనల్ కాల్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ దర్శకుడు జై హనుమాన్ కంప్లీట్ చేయడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.