బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరీ అలియా(Alia) భట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. తన స్నేహితుడు, నటుడు రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుని ఓ పాపకి జన్మనిచ్చిన తరువాత అలియా తన కెరీర్ లో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అలియా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డులో వేడుకలో తళుక్కున మెరిసింది.
ఈ వేడుకలో ఉత్తమ నటిగా అవార్డును (National award) అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో కాసేపు ముచ్చటించారు. '' నేను బాగా నటిస్తానని ఒకప్పుడు అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడేమో గొప్ప నటిని,మహా నటిని అంటున్నారు. ఇలా వచ్చే అవార్డులు నా మీద మరింత బాధ్యతను పెంచుతున్నాయి.
ఒకప్పుడు బాగా నటిస్తున్నావు అన్నవారందరూ కూడా ఇప్పుడు గొప్ప నటి, మహా నటి అంటే భయమేస్తుంది. నేను చేసే ప్రతి పాత్ర గొప్పది అవ్వాలని లేదు. అన్నిసార్లు కూడా గొప్ప పాత్రలు రావు. నేను ఎప్పుడూ కూడా కమర్షియల్ హీరోయిన్ నే. ఇప్పుడు డబ్బు కోసం నటించాలంటే భయంగా ఉంది అంటూ ఆమె చెప్పింది.
అతి చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుని అలియా రికార్డు సృష్టించింది. ఈ అవార్డును అందుకున్న వారిలో నేనే అతి పిన్న వయస్కురాలిని అని ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం తెలిసిన తరువాత రణ్‌బీర్ నాకు చాలా విలువైన బహుమతిని కానుకగా ఇచ్చాడు. కానీ ఆ కానుక ఏంటీ అనేది మాత్రం ఎవరూ అడగవద్దు..ఎందుకంటే అది సీక్రెట్ అంటూ నవ్వేసింది అలియా.
అటు సినీ ప్రపంచంతో పాటు ప్రముఖులు కూడా డీప్ ఫేక్ బాధితులుగా ఉన్నారు వారిలో రష్మిక ఒకరు. తాజాగా రెండు రోజుల క్రితం అలియా కు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గతంలోకంటే ఈసారి మరిత అసభ్యంగా ఉన్న వీడియోను ఆకతాయిలు నెట్టింట షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు షాక్ అవుతున్నారు. మరి ఇంతదారుణంగా దిగజారిపోయారంటూ ఇందుకు పాల్పడిన వ్యక్తులపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. బెడ్ రూమ్ లో స్లీవ్ లెస్ నైట్ డ్రెస్ ధరించిన ఓ యువతి కాస్త బోల్డ్ యాంగిల్స్ లో రీల్స్ చేసింది. బెడ్ పై కూర్చొని శృంగార భంగిమలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. అయితే ఈ వీడియో వైరల్ అవుతుండగా సోషల్ మీడియా అపరిచితులు ఆ అమ్మాయి ఫేస్‌కు అలియా ఫోటోను జతచేసిన రీపోస్ట్ చేశారు. ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఆ బాడీకి సరిపోలే విధంగా అలియా ఫేస్ క్రియేట్ చేశారు. అనుకోకుండా చూసిన నెటిజన్లకు అలియాదే అనే అనుమానం వచ్చేలా ముఖాన్ని అతికించారు ఆకతాయిలు.
అయితే వైరల్ అవుతున్న వీడియోపై స్పందిస్తున్న కొంతమంది రణ్ బీర్ ను ఉద్దేశిస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తుండగా మరికొంతమంది చూడగానే తెలిసిపోతుంది ఇది ఫేక్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలియాకు మద్దతుగా నిలుస్తూ సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై అలియా భట్ ఎలా స్పందింస్తుందో చూడాలి. ఇక రష్మిక, కాజోల్ ఘటన జరిగిన తర్వాత మార్ఫింగ్ వీడియోల పోస్టింగ్ కట్టడి కాలేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. గతంలోనూ కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కాజోల్, సారా టెండూల్కర్‌లు దీని బారిన పడ్డారు.
Also read: బ్రాందీ తాగితే జలుబు..దగ్గు ఫసక్…ఏంటీ బ్రో ఇది నిజమేనా..?