Bollywood Actress Shraddha Kapoor Dating With Movie Writer : బాలీవుడ్ (Bollywood) గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) గురించి తెలిసిందే. 'ఆషీకీ 2' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ లో నటించింది. ఇక తెలుగులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) తో కలిసి 'సాహూ' సినిమా చేసింది. ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ధా.. తనకంటే వయసులో మూడేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ రైటర్ రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తోందట. ప్రెజెంట్ బీ టౌన్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
శ్రద్ధా కపూర్ గతేడాది 'తు ఝూథీ మెయిన్ మక్కార్' అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఇందులో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా ఈ మూవీ రిలీజ్ తర్వాత శ్రద్ధా, రాహుల్ లపై డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియా (Social Media) లో ఓ రేంజ్ లో హల్చల్ చేయగా.. తాజాగా శ్రద్ధా కపూర్ ఇన్ స్టా పోస్ట్ తో అది నిజమే అని తేలింది.
Also Read : ప్రభాస్ వల్లే ఇలా మారిపోయా.. బేబీ బంప్ పై దీపికా పదుకొనే కామెంట్స్!
వయసులో చిన్నవాడితో డేటింగ్...
తాజాగా శ్రద్ధా కపూర్.. రాహుల్ మోడీతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో వీరిమధ్య వచ్చి న డేటింగ్ రూమర్స్ నిజమే అని స్పష్టమవుతుంది. కాగా రాహుల్ మోడీ శ్రద్ధా కపూర్ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్‌కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. ప్రస్తుతం వీరిద్దరి డేటింగ్ మ్యాటర్ బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.