Janhvi Kapoor : నాకు అలాంటి భర్తే కావాలి.. జాన్వీకపూర్ మాటలు వింటే షాక్!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తన కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. నవ్విస్తూ ఉండాలి, నేను ఏడిస్తే పక్కనే ఉంది దైర్యం చెప్పాలి. నా కలలను తన కలలుగా భావించేవాడు భర్తగా రావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.

New Update
Janhvi Kapoor : నాకు అలాంటి భర్తే కావాలి.. జాన్వీకపూర్ మాటలు వింటే షాక్!

Janhvi Kapoor Expressed Her Future Husband : బాలీవుడ్ (Bollywood) హాట్ బ్యూటీ (Hot Beauty) జాన్వీ కపూర్ (Janhvi Kapoor) వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన జాన్వీ గ్లిఫ్మ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

publive-image

దేవరతో పాటు రామ్ చరణ్ సరసన మరో మూవీ సైన్ చేసింది ఈ బ్యూటీ. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న RC16 సినిమాలో కథానాయికగా ఎంపికయింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ పూర్తవగానే ఈ మూవీ చిత్రీకరణకు వెళ్లనుంది.

publive-image

అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' తో మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న జాన్వీ.. తన కాబోయే భర్త గురించి అడగగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

publive-image
జాన్వీని తన కాబోయే భర్త ఎలా ఉండాలి అని అడగగా ఇలా చెప్పుకొచ్చింది. నాకు ఎప్పుడూ సపోర్ట్ గా, అండగా ఉండాలి. నేను సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. నవ్వించాలి.. నేను ఏడిస్తే దైర్యం చెప్పాలి. నా కలలను తన కలలుగా భావించేవాడు భర్తగా రావాలంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది జాన్వీ

publive-image

మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ ఒక క్రికెటర్ గా కనిపించబోతుంది. ఒక విఫలమైన క్రికెటర్ మహేంద్ర, డాక్టర్ అయిన మహిమ( జాన్వీ) పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒకటవుతారు. ఒకే పేరును కలిగి వీరు మిస్టర్ అండ్ మిసెస్ మహి గా మారుతారు. ఈ ప్రయాణంలో వీరిద్దరు క్రికెట్ పట్ల తమకు ఉన్న కామన్ అభిరుచిని తెలుసుకుంటారు. ఈ క్రమంలో క్రికెటర్ కావాలనే భార్య కలను హీరో ప్రోత్సహిస్తాడు. ఈ ప్రయాణంలో మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు అనేది సినిమా కథ.

Mirai : మాంత్రికుడిగా మంచు మనోజ్.. మిరాయ్ నుంచి అదిరిపోయే అప్డేట్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు