Hina Khan: స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నాను.. బుల్లితెర నటి పోస్ట్ వైరల్..! బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాని. దీని నుంచి త్వరగా బయటపడతానని బలంగా నమ్ముతున్నాను అని హీనా ఖాన్ రాసుకొచ్చారు." By Archana 28 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hina Khan: బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ సోషల్ మీడియాలో వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. నటి హీనా ఖాన్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు, పలువురు సెలెబ్రెటీలు హీనా త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న నటి హీనా ఖాన్ హీనా ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. "హలో! నన్ను ప్రేమించే వ్యక్తులందరితో ఈ ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాను. ఇది చాలా టఫ్ టైం. అయినప్పటికీ దీన్ని అధికమించడానికి నేను బలంగా ఉన్నాను. నా చికిత్స ఇప్పటికే ప్రారంభమైంది. దీని నుంచి త్వరగా బయటపడతానని బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి సమయంలో నాపై గౌరవం ఉంచి గోప్యతకు భంగం కలిగించవద్దని అభిమానులను విజ్ఞప్తి చేస్తున్న. అలాగే మీ సపోర్ట్, ప్రేయర్స్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయ, కుటుంబసభ్యుల ఆశీస్సులతో పూర్తి ఆరోగ్యంగా ఉంటానని నమ్ముతున్నాను అని రాసుకొచ్చారు." View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) అయితే గత ఏప్రిల్ నెలలో హీనా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు. సరిగ్గా తినలేకపోతున్నానని సోషల్ మీడియాలో చెప్పడం గమనార్హం. హీనా ఖాన్ 'యే రిష్తా క్యా కెహ్లాతా', కసౌటి జిందగీ కే, నాగిన్ వంటి హిందీ సీరియల్స్ లో నటించింది. అలాగే పాపులర్ రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 8 లో పాల్గొంది. #cancer #breast-cancer #hina-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి