Sahil Khan : పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 1800కి.మీ. పారిపోయిన బాలీవుడ్ నటుడు.. చివరికి ఏమైందంటే..?

మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ కి బాంబే కోర్టు బెయిల్ నిరాకరించడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రాలు దాటుతూ సుమారు 1800.కి.మీ. ప్రయాణించినట్లు సమాచారం.

Sahil Khan : పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 1800కి.మీ. పారిపోయిన బాలీవుడ్ నటుడు.. చివరికి ఏమైందంటే..?
New Update

Mahadev Betting App Case : మహాదేవ్ యాప్(Mahadev App) బెట్టింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు సాహిల్ ఖాన్(Sahil Khan) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం ఛత్తీస్ గఢ్ లో సాహిల్ ఖాన్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కాగా ఈ కేస్ లో సాహిల్ ముందస్తు బెయిల్ కోసం బాంబే కోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ ని తిరస్కరించింది. తాను సెలెబ్రిటీ కావడం వలనే యాప్ కు బ్రాండ్ ప్రమోటర్ గా పనిచేశానని, యాప్ ద్వారా జరిగే కార్య కలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపినా.. కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఈ నటుడు రాష్ట్రాలు దాటడం మొదలు పెట్టాడు.

4 రోజుల్లో 1800కిలో మీటర్లు

సాహిల్ ఖాన్ కి బాంబే కోర్టు(Bombay Court) బెయిల్ నిరాకరించడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏప్రిల్ 25 నుండి రాష్ట్రాలు దాటడం మొదలెట్టాడు. మొదట మహారాష్ట్ర నుంచి గోవాకి వెళ్ళాడు. అక్కడి నుంచి కర్ణాటక వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణకి వచ్చాడు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్న క్రమంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషాలు మార్చాడు. అలాగే ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేసేవాడు.

Alo Read : 80 ఏళ్ళ వయస్సులో పెళ్లి చేసుకున్న వృద్దులు.. తెలంగాణాలో వింత పెళ్లి, వీడియో వైరల్ !

ఛత్తీస్ ఘడ్ లో పోలీసుల అదుపులోకి

చివరగా ఛత్తీస్ ఘడ్ పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే రాత్రిపూట ఆ రాష్ట్రంలో ప్రయాణించడానికి అతని డ్రైవర్ అంగీకరించలేదు. అయినా తాను రోడ్డు మార్గం లోనేవెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అప్పటికే సాహిల్ జాడ పసిగట్టిన పోలీసులు.. అతను ఛత్తీస్ ఘడ్ రాగానే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాహిల్ ఖాన్ ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రాలు దాటుతూ సుమారు 1800.కి.మీ. ప్రయాణించినా సరే పోలీసుల నుంచి తప్పించుకోలేక పోయాడు.

2023 లోనే సమన్లు జారీ

పలు బాలీవుడ్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాహిల్ ఖాన్ కు బెట్టింగ్ యాప్ కేసులో సిట్ 2023 డిసెంబర్ లోనే సమన్లు జారీ చేసింది. కానీ అప్పుడు సాహిల్ విచారణకు హాజరు కాలేదు. ఇక తాజాగా అరెస్ట్ అవ్వడంతో ముందస్తు బెయిల్ కి పిటిషన్ వేసినా కోర్టు దాన్ని నిరాకరించింది. కాగా 2022 లోనే సాహిల్ ఖాన్ బెట్టింగ్ యాప్ తో ఒప్పదం కుదుర్చుకున్నట్లు తెలిసింది.

#bollywood #mahadev-betting-app-case #sahil-khan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe