Akshay Kumar : నా సినిమాలు ప్లాప్ అవుతుంటే అది చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు : అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ 'సర్ఫిరా' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అక్షయ్‌ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించారు. కొందరు వ్యక్తులు నా సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటే, చూసి సంతోషపడుతున్నారు. అలా చూడటం వాళ్లకిష్టం. ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలని అన్నాడు .

New Update
Akshay Kumar : నా సినిమాలు ప్లాప్ అవుతుంటే అది చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు : అక్షయ్ కుమార్

Bollywood Actor Akshay Kumar Latest Interview : బాలీవుడ్ (Bollywood) లో అత్యంత వేగంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముందు వరుసలో ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఈ హీరో ఒకే ఏడాదిలో మూడేసి సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో అక్షయ్ నుంచి ఏకంగా పది సినిమాలొచ్చాయి. అందులో రెండు మాత్రమే సక్సెస్ అందుకున్నాయి.

ఇక తాజాగా 'సర్ఫిరా' (Sarfira) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూర్య నటించిన ‘సూరారైపోట్రు’ (ఆకాశం నీహద్దురా) రీమేక్‌గా ఇది రూపొందింది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా అక్షయ్‌ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించారు.

Also Read : విజయ్ ‘గోట్’ నుంచి డ్యాన్స్ ఆంథమ్‌.. ఆకట్టుకుంటున్న ‘విజిలేస్కో’ సాంగ్..!

నిందలు వేసుకోవడం కరెక్ట్ కాదు..

" ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, వదంతులు వ్యాప్తి చేయడం సరికాదు. సినిమా కోసం కచ్చితంగా ఎనిమిది గంటలు పనిచేస్తా. నా వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే కదా. ఇలాంటి అసత్య వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో పూర్తి వివరాల్లోకి వెళ్లాలనుకోవడం లేదు. ఎక్కడో ఒకచోట ఇది మొదలైంది. నేనంటే గిట్టని వాళ్లు దాన్ని మరింత ముందుకు తోశారు. ఒకట్రెండు సినిమాల విషయంలో జరిగిన దాన్ని అన్నింటికీ ఆపాదించి చూపుతున్నారు.

అలా చూడటం వాళ్లకు ఇష్టం...

కొందరు వ్యక్తులు నా సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటే, చూసి సంతోషపడుతున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. నేను నా శ్రమ, కష్టాన్ని నమ్ముకున్నా. అయితే, ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. నేను ఇండస్ట్రీకి వచ్చి, 33-34 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఇతరుల పట్ల నేనెప్పుడూ చెడుగా మాట్లాడలేదు. ఇతరుల పేరును కించపరిచి, వాళ్లను కిందలాగే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం" అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisment
తాజా కథనాలు