Tea Tips: టీ చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? అయితే మీరు విషం తాగినట్లే..! 'టీ'ని ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగించకూడదు. టీ ఆకులను పదే పదే ఉపయోగించడం, అదే పాన్‌లో మళ్లీ మళ్లీ టీ చేయడం, 'టీ'ని ఎక్కువసేపు మరిగిచడం, సిద్ధంగా ఉన్న 'టీ'ని మళ్లీ మరిగించి తాగడం.. ఇవన్నీ ఆరోగ్యానికి విషపూరితం చేస్తాయి. By Vijaya Nimma 25 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tea Tips: చలికాలంలో టీ ఔషధం ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉంటే టీ తాగండి, జలుబు, దగ్గు ఉంటే టీ ఉపశమనాన్ని ఇస్తుంది. ఆఫీసులో అలసిపోయినట్లు అనిపిస్తే టీ తాగుతారు. టీ చేసేటప్పుడు కొంతమంది కొన్ని పొరపాటు చేస్తారు.టీ సరిగ్గా తయారు చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆర్ట్ మేకింగ్ టీ మీరు ఎప్పుడైనా చేశారా.? దానిని ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు. అందరూ టీ చేస్తారు. అయితే.. అందరూ ఆరోగ్యకరమైన టీని తయారు చేయలేరు. టీ తయారుచేసేటప్పుడు మనం తరచుగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. దాని వల్ల టీ ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. మీరు టీ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. మీ ఉదయం, సాయంత్రం టీ విషంగా మారుతుంది. ప్రతిరోజూ వంటగదిలో తయారు చేసే టీ రుచి భిన్నంగా ఉంటుంది. కొందరికి అల్లం టీ, ఏలకుల టీ, స్ట్రాంగ్ టీ, ఎక్కువ పాలతో తాగటం ఇష్టం ఉంటుంది. అయితే.. టీ రుచి కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా తయారు చేసుకోవాలని గుర్తుచుకోవాలి. ఇప్పుడు సరైన పద్ధతితో టీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీని ఇలా చేస్తే హాని ఉండదు పర్ఫెక్ట్ టీ కోసం: ముందుగా పాన్‌లో పాలను మరిగించాలి. ఈ పాలు మరిగే లోపు మరొక పాన్‌లో 1 పెద్ద కప్పు నీటిని ఉంచాలి. నీరు మరిగేటప్పుడు.. అందులో సుమారు 1 టీస్పూన్ టీ ఆకులు, అల్లం, యాలకులు, తుస్లీ, ఏదైనా టీపోడి వేయాలనుకుంటే మీ ఎంపిక ప్రకారం వేసుకోవాలి. తరువాత మీడియం మంట మీద కేవలం 5 నిమిషాలు మరిగించాలి.ఆపై అరకప్పు పాలు, రుచికి సరిపడ చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు టీని 3 నుంచి 5 సార్లు ఎక్కువ మంట మీద మరిగించాలి.తరువాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇలా తయారు చేసిన టీ వల్ల పెద్దగా హాని ఏం ఉండదు. అయితే.. టీ చేయడానికి ఉత్తమ మార్గం నీటిని మరిగించాలి. టీ ఆకులు, ఏదైనా ఫ్లేవర్ వేసి దానిని ఫిల్టర్ చేయడం. తర్వాత కప్పులో మరిగిన పాలు, పంచదార కలపాలి. ఇలా చేసే టీ ఆరోగ్యానికి అస్సలు హాని చేయదు. టీ తయారు చేసేటప్పుడు.. టీ చేయడానికి పట్టే సమయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. టీని ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగించకూడదు. టీ ఆకులను పదే పదే ఉపయోగించడం, అదే పాన్‌లో మళ్లీ మళ్లీ టీ చేయడం, టీని ఎక్కువసేపు మరిగిచడం, సిద్ధంగా ఉన్న టీని మళ్లీ మరిగించి తాగడం.. ఇవన్నీ ఆరోగ్యానికి విషపూరితం చేస్తాయి. ఇది కూడా చదవండి: ఇంట్లో తయారు చేసిన రూమ్ ఫ్రెషనర్ల గురించి తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. #tea-tips #tea #health-problems #tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి