Body painting In Honour Of Chandrayaan 3: చంద్రయాన్-3 ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 23సాయంత్రం 6 గంటల 04 నిమిషాలకు జాబిల్లిపై ల్యాండర్ కాలు మోపిన నాటి నుంచి ఐదు రోజులు గడస్తున్నా నెట్టింట మాత్రం చంద్రయాన్‌కి సంబంధించిన వార్తలు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సోషల్‌మీడియాను ఓ నాన్-క్రికెట్, నాన్-సినిమా న్యూస్ ఊపేస్తోంది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లప్పుడు మాత్రమే..అది కూడా పాకిస్థాన్ పోరు రోజు మాత్రమే కనిపించే దేశభక్తి ఈ సారి చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో కనిపిస్తుండడం ఆనందించాల్సిన విషయం. చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగం సక్సెస్ అవ్వాలని ఒక్కొక్కరు ఒక్కొ స్టైల్‌లో తమ సపోర్ట్ చూపించారు. కొందరు బాడీపై పెయింటింగ్‌లు వేసుకోని దేశంపై ఉన్న భక్తిని చాటుకున్నారు.
-
Image credit: Amit Dave/Reuters 'ఆజ్ చంద్ సే జ్యాదా దేశ్ చమక్ రహా హై'.
అహ్మదాబాద్‌లోని ఓ యువతి చంద్రయాన్-3కి తాను ఎంత ఫ్యానో చూపించుకుంది. తన వీపుపై చంద్రుడి స్కెచ్, మూన్ క్రాఫ్ట్, భారత జెండా రంగులతో పెయింట్ చేసుకుంది. -
Image credit: Amit Dave/Reuters అహ్మదాబాద్‌కు చెందిన అరుణ్ హర్యానీ త్రివర్ణ పతాకాలతో నిండిన బాడీ సూట్ ధరించాడు.
రూఫ్‌టాప్ నుంచి జెండేను ఊపుతూ తన దేశంపై భక్తిని చాటుకున్నాడు. ఈ ఫొటో అంతర్జాతీయ మీడియాలో సైతం కనిపించింది. -
Image credit: Amit Dave/Reuters రాయిటర్స్ ఫొటో జర్నలిస్ట్ అమిత్‌దేవ్ (Amit Dave) తీసిన మరో అరుణ్ ఫొటో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.అరుణ్ నుదుటిపై పెద్ద పెద్ద అక్షరాలతో 'ఇండియా' అని రాసుకున్నాడు. అటు.. చంద్రుడిపైకి వెళ్లిన ఎల్వీఎం3-ఎం4 (LVM3 M4) ప్రోటోటైప్‌ని పట్టుకున్నాడు.
-
Image credit: ANI ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీసిన ఫొటో. ఓ వ్యక్తి ఇండియా ట్రై కలర్స్‌ని బాడా మొత్తం పెయింట్ చేసుకుని కనిపించాడు.
నిజానికి ఈ టైప్ పొటోలు మనం గతంలో చూసిన ఫొటోలే. క్రికెట్ మ్యాచ్ సమయంలో ఇలాంటివి గతంలోనే చూశాం. క్రికెట్‌గాడ్ సచిన్ వీర భక్తుడు సుదీర్ ఈ తరహా ట్రెండ్‌కి కారకుడు. సచిన్ రిటైర్‌మెంట్ తర్వాత కూడా టీమిండియాకు సపోర్ట్‌గా ఎక్కడ మ్యాచ్ ఉంటే అక్కడ వాలిపోతాడు సుదీర్. ఇక కెప్టెన్ కూల్ ధోనీని అభిమానించే మరో వ్యక్తి కూడా ఈ తరహా స్టైల్‌లో స్టేడియంలో కనిపిస్తుంటాడు. ఇండియన్స్‌కి క్రికెట్ అంటే చాలా పిచ్చి. క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో దేశమంతా ఒకే తాటిపై ఉంటుంది. టీమిండియాకు చీర్స్ చేస్తుంది.. కుల,మత బేధాలను పక్కన పెట్టి సపోర్ట్ చేస్తుంది.. ఇప్పుడు చంద్రయాన్ విషయంలో భారతీయులు అంతకంటే ఎక్కువ యూనిటీనే చూపించారు. అన్ని వర్గాల ప్రజలకు చంద్రయాన్ దగ్గరైంది.. ఇది సైన్స్‌కి సంబంధించిన ప్రయోగమే అయినా.. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో తమదైన శైలిలో దేశభక్తి చూపించారు. పైన చూపించిన ఫొటోలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.