Kota : కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహాం లభ్యం..

ఇటీవల రాజస్థాన్‌లోని కోటాలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమవ్వగా.. అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్‌ సోంధ్య (16) మృతదేహం లభ్యమైంది. గర్దియా మహదేవ్‌ మందిర్‌ సమీపంలోని ఓ అటవీ ప్రాంతం సమీపంలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Rachit Sondhya : ఇటీవల రాజస్థాన్‌(Rajasthan) లోని కోటా(KOTA) లో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీళ్లలో రచిత్‌ సోంధ్య(Rachit Sondhya) (16) అనే విద్యార్థి మృతదేహాం ఓ అటవి ప్రాంత సమీపంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) కు చెందిన రచిత్‌ సోంధ్య.. కోటాలో ఏడాదికి పైగా జేఈఈ పరీక్ష(JEE Exam) కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి 11న హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిన అతడు ఆ రోజు నుంచి కనిపించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే.. గర్దియా మహదేవ్‌ మందిర్‌ సమీపంలోని ఓ అటవి ప్రాంతంలోకి అతడు ప్రవేశించినట్లు కనిపించింది.

Also Read :  ప్రతీ భక్తుడు వీఐపీనే.. మేడారం ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక ప్రకటన..

తొమ్మిది రోజుల క్రితం అదృశ్యమైన ఆ విద్యార్థి ఇలా మృతదేహామై కనిపించడం కలకలం రేపుతోంది. మహదేవ్‌ మందిర్‌(Mahadev Mandir) వద్ద పోలీసులు.. సోంధ్యకి సంబంధించిన బ్యాగు, మొబైల్‌ ఫోన్, రూం తాళాలు, ఇతర వస్తువులను గుర్తించారు. అలాగే అతడు ఉంటున్న గదిలో కూడా ఓ నోట్‌ను గుర్తించారు. అందులో తాను గుడికి వెళ్తున్నట్లు రాశాడు. అయితే సోంధ్య అదృశ్యమైనప్పటి నుంచి.. పోలీసులు, ఎస్‌ఆర్‌ఢీఎఫ్‌ బృందాలు అతడి ఆచూకి కోసం గాలిస్తూనే ఉన్నాయి. చివరికి అటవీ ప్రాంతం సమీపంలో అతడి మృతదేహం లభ్యమైంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇంకా ఏదైన జరిగిందా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన యువరాజ్‌ (18) అనే విద్యార్థి కూడా గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఇతడు కోటా(Kota) లోని ఓ ప్రైవేట్‌ కోచింగ్ సెంటర్‌లో నీట్‌ పరీక్ష(NEET Exam) కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. గత శనివారం రోజున కోచింగ్ సెంటర్‌కు వెళ్లేందుకు యువరాజ్‌.. ఉదయం 7.00 గంటలకు హాస్టల్ నుంచి బయలుదేరాడు. అప్పటి నుంచి అతను కనిపించడం లేదు. మరో విషయం ఏంటంటే యువరాజ్‌ తన మొబైల్‌ ఫోన్‌ను కూడా హాస్టల్‌లోనే వదలేసి వెళ్లాడు. ఇతడి ఆచూకి కోసం కూడా పోలీసులు గాలిస్తునే ఉన్నారు.

Also Read : రూ. 13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్న మోదీ!

Advertisment
తాజా కథనాలు