Soups: ఈ సూప్‌‌లతో పాలను మించిన పోషకాలు.. ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం

శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటే పానీయాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం ఆకుపచ్చ స్మూతీ, ఎముక సూప్, టమాటో రసం, బెర్రీస్, యోగర్ట్ స్మూతీ, ఆరెంజ్ జ్యూస్ వంటి వాటిల్లో కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మంచిది.

Soups: ఈ సూప్‌‌లతో  పాలను మించిన పోషకాలు.. ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం
New Update

Soups: ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి తగినంత కాల్షియం అవసరమని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి కాల్షియం గ్రహించడంలో సహాయపడటానికి విటమిన్ డి కూడా అంతే అవసరం. ఈ రెండు పోషకాల లోపం వల్ల ఎముకలు బలహీనంగా, అనారోగ్యానికి గురవుతాయి. శరీరం మొత్తం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఎముకలలో ఏదైనా సమస్య, బలహీనత ఉంటే శరీరానికి హానికరం. ఎముకలలో కాల్షియం, విటమిన్ డి లోపం వల్ల ఎముక వ్యాధులు రికెట్స్, బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రెండు వ్యాధులు.. వీటిలో ఎముకలు చాలా బలహీనంగా, పెళుసుగా మారతాయి. చిన్న దెబ్బతో కూడా సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంది. ఎముకలు బలపడాలంటే ఏం చేయాలి..? పోషకాహార నిపుణుల ప్రకారం.. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, కాల్షియం లోపాన్ని అధిగమించడానికి మార్గం కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతోపాటు విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తినాలని చెబుతున్నారు. పాలు,పెరుగు వంటి పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మీకు నచ్చకపోతే..కొన్ని పానీయాలను త్రాగవచ్చు. ఆ పానీయాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుపచ్చ స్మూతీ:

  • పాలంటే ఇష్టం లేనివారు ఆకు కూరల స్మూతీని తాగవచ్చు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్,మినిరల్స్ ఎముకలను బలపరిచే ఖనిజ కాల్షియం కూడా ఇందులో ఉంటుంది. దీనిని తాగితే..విటమిన్ డి మేరుగుపరచటంతో సహాయపడుతుంది.

బెర్రీస్ స్మూతీ:

  • బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ ,క్యాల్షియం సమృద్ధిగా ఉన్న పెరుగుతో కలిపినప్పుడు..దాని శక్తి రెట్టింపు అవుతుంది.ఇది కూడా ఎముకలను బలపరుస్తుంది.

టమాటో రసం:

  • టొమాటోస్‌లో ఉండే లైకోపీన్ ఎముకలు దెబ్బతినకుండా కాపాడే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. టొమాటో జ్యూస్‌ని తక్కువ మోతాదులో తాగితే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆరెంజ్ జ్యూస్:

  • ఆరెంజ్ జ్యూస్‌లో సహజంగానే అధికంగా విటమిన్ సి ఉంటుంది.ఇది విటమిన్లు,మినరల్స్ ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.

ఎముక సూప్:

  • చికెన్, గొడ్డు మాంసం ఎముకలతో తయారు చేసిన సూప్‌తో అనేక ప్రయోజనాలున్నాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే కొల్లాజెన్, మినరల్స్ ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి.

ఇది కూడా చదవండి: బాదంపప్పులు మించి..ఈ ఇంటి ధాన్యాలతో ఆరోగ్యం గ్యారెంటీ

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #soup
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe