Blinkit : ఆ ఆన్‌లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం

ఓ వినియోగదారుడు తన తల్లి సూచన మేరకు .. బ్లింకిట్ అనే ఆన్‌లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు. అతని తల్లి సూచన మేరకు కొత్తిమీరను ఉచితం చేసేశారు.

New Update
Blinkit : ఆ ఆన్‌లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం

Coriander Free : ప్రస్తుతం.. అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌ (Online) లో అందుబాటులోకి వచ్చాయి. చాలామంది తమకు కావాల్సినవి ఆన్‌లైన్‌ నుంచే తెప్పించుకుంటున్నారు. మరికొందరైతే బయటకు వెళ్లకుండానే కూరగాయలు (Vegetables) కూడా ఆన్‌లైన్‌లో ఆర్టర్‌ పెట్టేస్తున్నారు. అయితే ఓ వినియోగదారుడు.. ఒక ఆన్‌లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు. ఆమె సూచన మేరకు కొత్తిమీరను ఉచితం చేసేశారు.

Also Read: రేపు బీజేపీ కార్యాలయానికి వస్తున్నా.. కేజ్రీవాల్‌ సవాల్

ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయి కి చెందిన అంకిత్ సావంత్ అనే వ్యక్తి ఇటీవల ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ' నేను బ్లింకిట్‌లో కూరగాయలు కొన్నాను. అందులో కొత్తిమీర (Coriander) కు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు చిన్నాపాటి గుండెపోటుకు గురైంది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఫ్రీగా ఇస్తే కదా అని మా అమ్మ సలహా' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టును బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సాకు ట్యాగ్ చేశారు. దీనిపై ధిండ్సా స్పందించారు. ముందుగా మేము దీన్ని పరిశీలిస్తాం అంటూ పోస్టు చేశారు. ఆ తర్వాత తమ యాప్‌లో కొత్తిమీరను ఉచితంగా ఇస్తున్నట్లు మరో పోస్ట్ చేశారు. ' కొత్తిమీర ఉచితం అందుబాటులోకి వచ్చింది. అందరూ అంకిత్ అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పండి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత అప్‌డేట్ చేస్తామంటూ రాసుకొచ్చారు.

సీఈవో తీసుకున్న నిర్ణయంపై నెటీజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. చాలామంది దీన్ని స్వాగతిస్తున్నారు. మరికొందరు మిర్చి, మెంతి, పూదీన కూడా ఫ్రీగా ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు వీటిల్లో ఏదో ఒకదాన్ని ఫ్రీ కోసం ఎంచుకునే ఆప్షన్ పెట్టాలంటున్నారు.

Also read: ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే

#online-order #blinkit-ceo #blinkit #coriander #vegetables
Advertisment
తాజా కథనాలు