జనసేనతో పొత్తుపై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జనసేనతో పొత్తుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతామని తెలిపారు. ఢిల్లీలోని నవంబవర్ 1వ తేదీన సీఈసీ మీటింగ్ ఉందని తెలిపారు. కాగా బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పై యువతలో అసంతృప్తి ఉందన్నారు. ఆ అసంతృప్తి అక్కడక్కడా ఎమ్మెల్యేలకు ఎదురైతున్నా పోలీసులు కప్పి పెడుతున్నారన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి..ఉద్యోగాలను భర్తీ చేస్తామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కేంద్రం మాదిరిగానే రాష్ట్రంలోనూ నియమాకాలను చేపడతామన్నారు. కేంద్రం భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఒక పేపర్ కూడా లీక్ కాలేదన్నారు. అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్న కిషన్ రెడ్డి...అభ్యర్థులను ప్రకటించిన అనంతరం అసమ్మతి నేతలతో కూడా మాట్లాడతామని తెలిపారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు నుంచి కీలక అప్డేట్..!!
అటు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. ప్రజలను ఓట్లు అడిగే ముందు వారికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. లేనిపోని సాకులతో ఉద్యోగ నియామకాలు చేయకుండా కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే నేడు 30లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కేసీఆర్ కు నిరుద్యోగ కుటుంబాల బాధ తెలియదన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగుల బాధ సీఎంకు పట్టదన్నారు. ప్రవళిక ఆత్మహత్య పాపం కేసీఆర్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం లో భాగంగా ఆడిన డ్రామా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసునన్నారు. కేసీఆర్ అసమర్ధత వల్లే 17సార్లు పరీక్షలు వాయిదాపడ్డాయని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈ గిన్నీస్ రికార్డు కేసీఆర్ కుటుంబానికే దక్కిందంటూ సెటైర్లు వేశారు.
ఇది కూడా చదవండి: కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచింది ఇతడే.. ఫొటో రిలీజ్ చేసిన బీఆర్ఎస్!
దేశంలో అత్యధిక నిరుద్యోగ రెట్ తెలంగాణలోనే ఉందన్నారు. పదేళ్లలో ఒక్క గ్రూప్1, టీచర్ పోస్ట్ భర్తీ చేయని రికార్డ్ అవార్డ్ కేసిఆర్ కే దక్కుతుందన్నారు కిషన్ రెడ్డి. 1లక్ష 92 వేల ఉద్యోగ ఖాళీలు సీపీ బిశ్వాస్ కమిటీ వెల్లడించిందని..2022 నాటికి వాటి సంఖ్య 2లక్షలకు చేరిందన్నారు. కమిటి నివేదికను సైతం దాచారని మండిపడ్డారు. 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కమిటీ పేర్కొన్నదని గుర్తు చేశారు. సింగిల్ టీచర్స్ తో 6వేల 8వందల స్కూల్స్ నడుస్తున్నాయని..యూనివర్సిటీల్లో 2వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. 4వేల కోట్లకు పైగా రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లించాల్సి ఉందని..ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం యూనివర్శిటీ లో ఉన్న పరిస్థితి పై వైట్ పేపర్ విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.