BJP-JDS: సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ-జేడీఎస్ విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కూడా పాత మిత్రులను దగ్గర చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన జీడీఎస్ పార్టీతో పొత్తుకు ముందుకొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీచేయాలని ఓ అంగీకారానికి వచ్చినట్లు మాజీ సీఎం యడియూరప్ప ప్రకటించారు. By BalaMurali Krishna 09 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BJP-JDS: విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కూడా పాత మిత్రులను దగ్గర చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన జీడీఎస్ పార్టీతో పొత్తుకు ముందుకొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీచేయాలని ఓ అంగీకారానికి వచ్చినట్లు మాజీ సీఎం యడియూరప్ప ప్రకటించారు. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ఈ పొత్తు ఖరారైందని విశ్లేషకులు చెబుతున్నారు. 4 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం.. కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ సీట్లలో నాలుగు సీట్లను జీడీఎస్‌కు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. మాండ్యా, హసాన్, బెంగళూరు(రూరల్), చిక్‌బల్లాపూర్ సీట్లను జేడీఎస్ కోరుతోందని సమాచారం. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్లో మూడింట బీజేపీ గెలవగా.. కేవలం హసాన్‌లో మాత్రమే జేడీఎస్ గెలిచింది. దేవెగౌడ గత ఎన్నికల్లో తుమ్‌కూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక దేవెగౌడ మనవడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జేడీఎస్ కంచుకోట అయిన హసన్‌లో మాత్రం దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు. అయితే ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కర్ణాటక హైకోర్టు ప్రజ్వల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. కుప్పకూలిన కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన జీడీఎస్‌కు 38 సీట్లు రావడంతో కూటమి తరపున కుమారస్వామి సీఎం అయ్యారు. అయితే బీజేపీలోకి కూటమి ఎమ్మెల్యేలు వెళ్లడంతో కమలం ప్రభుత్వం ఏర్పడింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, జేడీఎస్ విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ఈ క్రమంలో ఒంటరిగా మిగిలిన జేడీఎస్.. ప్రస్తుతం బీజేపీ వైపు మళ్లింది. దేవెగౌడ నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహం.. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలిచింది. కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెరో సీటు దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బ్రేక్ వేయాలని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే జేడీఎస్‌తో పొత్తుకు మొగ్గు చూపింది. ఈ పొత్తు ఇటు బీజేపీతో పాటు అటు జేడీఎస్ లాభం చేకూరనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీకి జేడీఎస్ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవెగౌడ కోతి లాంటి వారని.. ఆయన గెలవరు.. ఇతరులను గెలవనివ్వరని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: జీ 20 సదస్సులో మోడీ ముందు ‘భారత్’ నేమ్ ప్లేట్! #bjp #modi #hd-devagouda #jds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి