PM Modi Kerala Tour: అవినీతి మయమైన కేరళ రాష్ట్రంలో కమలం వికసించబోతుందంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కేరళ రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్డీయే తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ.. అవినీతి, అసమర్థ ప్రభుత్వాల వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
అవినీతి, అసమర్థత..
ఈ మేరకు కేరళలోని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. అవినీతి, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న ఆయా ప్రభుత్వాల హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆరోపించారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు విచ్ఛిన్నమైతేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అలాగే గత ఎన్నికల్లో కేరళ ప్రజలు బీజేపీని రెండంకెల ఓట్ల శాతం కలిగిన పార్టీగా మార్చారని, ఈ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించే గమ్యం ఇంకెంతో దూరం లేదన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల వల్ల రబ్బరు రైతులు కష్టాలపాలవుతున్నారని, అయినా నాయకులంగా కళ్లు మూసుకొని వహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు అసమర్థ నాయకుల కారణంగా కేరళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: YS Sharmila: జగనన్న ఇంతలా దిగజారిపోతారనుకోలేదు.. ఆయన వారసుడిగా ఏం చేశారు?
ఇది 'మోడీ గ్యారెంటీ'..
ఇక గత 10 సంవత్సరాలలో ప్రతి ప్రాంతంలోని ప్రతి వర్గానికి సాధ్యమైనంత మేలు చేసే ప్రయత్నాలు చేసామన్నారు. ఇరాక్ యుద్ధంలో చిక్కుకున్న నర్సులను తిరిగి తీసుకువచ్చామన్నారు. కరోనా సంక్షోభం మధ్య ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుంచి భారతీయులను తిరిగి తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఒక భారతీయుడు ఎక్కడ కష్టాల్లో ఉన్నా.. తమ ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని ఇది 'మోడీ గ్యారెంటీ' అన్నారు.