Exit polls:రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఇక్కడ 199 స్థానాల్లో మ్యాజిక్ నంబర్ వంద దాటితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చును. అయితే ఈసారి ఇక్కడ బీజేపీ గాలి బలంగా వీస్తోందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 01 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి రాజస్థాన్ లో ప్రతీ టర్మ్ కు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. దీంతో ఇక్కడ రాజకీయాలు ఈసారి రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక నెక్స్ట్ తమదే అని బీజేపీ వాళ్ళు ధీమాగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 100 కంటే ఎక్కువ స్థానాలే గెలుచుకుంటుందని పోల్ సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, ఈ సారి కచ్చితంగా తామే గెలుస్తామని బీజేపీ గట్టిగానే ప్రచారం చేసుకుంది. మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాషాయ పార్టీ పట్టుదలతో ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం తాము చేపట్టిన ప్రభుత్వ పథకాలే తమన మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తాయని బలంగా నమ్ముతోంది. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా మాకు అనవసరం...రాజస్థాన్లో బీజేపీ గెలిచే ఛాన్సే లేదని చెబుతున్నారు. రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని నమ్మకం చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఒక్క ఇండియా టుడే తప్ప మిగతా అన్ని సర్వేలు బీజేపీనే అధికారంలో వస్తుందని చెప్పాయి. ఇండియా టుడే మాత్రం మళ్ళీ కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంటోంది. పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ-95-115 కాంగ్రెస్ 73-95 ఇతరులు - 8-11 ఇండియా టుడే బీజేపీ 55-72 కాంగ్రెస్ - 119-141 ఇతరులు - 4-11 న్యూస్ 18 సర్వే బీజేపీ - 111 కాంగ్రెస్- 74 ఇతరులు- 14 జన్ కీ బాత్ సర్వే బీజేపీ- 100-122 కాంగ్రెస్- 62-85 ఇతరులు- 14-15 రిపబ్లిక్ టీవీ-Matrize బీజేపీ- 105-125 కాంగ్రెస్- 69-81 ఇతరులు- 5-12 టైమ్స్ నౌ సర్వే బీజేపీ - 108-128 కాంగ్రెస్ - 56-72 ఇతరులు - 13-21 అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం అంచనాలు మాత్రమే. ఇవి తారుమారు అయ్యే ఛాన్స్ లు కూడా ఉంటాయి. ఓటరు ఒక సర్వే ఏజెన్సీ అడిగితే ఒకలా...ఇంకో సర్వే ఏజెన్సీ అడిగితే ఇంకోలా చెప్పవచ్చును. అసలు ఫలితాలు తేలిది మాత్రం ఓట్ల లెక్కింపు రోజునే. ఐదు రాష్ట్రాల పోలింగ్ వేరు వేరు రోజుల్లో జరిగినా..ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజున జరుగుతుంది. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 3 న ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలిపోతుంది. #elections #rajasthan #exit-poll-survey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి