Telangana Elections 2023: అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. అమిత్‌ షా సంచలన ప్రకటన..

బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రశ్నాపత్రాల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు.

New Update
Kishan Reddy: ఈ నెల 12న హైదరాబాద్‌కు అమిత్ షా

మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాలు, హామీలతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారంటూ అమిత్ షా ఆరోపించారు.

Also read: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ డైరెక్ట్ అటాక్.. వాడో పిచ్చికుక్క, రైఫిల్ రెడ్డి అంటూ..

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి.. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కూడా దళితుడ్ని సీఎం చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు బీసీ కమ్యూనిటీకి విరోధం అంటూ మండిపడ్డారు. అలాగే తెలంగాణ యువతను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని.. ప్రశ్నాపత్రాల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. ఒవైసీకి లొంగిపోయి తెలంగాణ విమోచన దినోత్సవం జరపలేదని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ ప్రస్తుతం అప్పుపాలైందంటూ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో, అలాగే మియాపూర్‌ భూముల్లో భారీగా కుంభకోణం జరిగిందన్నారు. స్మార్ట్‌ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కేసీఆర్ దుర్వినియోగం చేశారంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ఓబీసీలకు స్థానాలు కల్పించారని.. అలాగే ఎంబీబీఎస్‌ సీట్లలో బీసీలకు 25 శాతం వరకు రిజర్వేషన్లు పెంచామని వెల్లడించారు.

Also read: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా?

Advertisment
తాజా కథనాలు