M Kharge: ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బును ఫ్రీజ్‌ చేశారు.. ఏన్డీఏపై ఖర్గే విమర్శలు!

బీజేపీ గవర్నమెంట్ తమ పార్టీ దగ్గర డబ్బులు లేకుండా చేసి, ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్డీయే స్తంభింపజేసిందని, అందంతా ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్మేనని ఆందోళన వ్యక్తం చేశారు.

M Kharge: ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బును ఫ్రీజ్‌ చేశారు.. ఏన్డీఏపై ఖర్గే విమర్శలు!
New Update

M Kharge: కాంగ్రెస్ పార్టీ(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ బ్యాంకు ఖాతాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్తంభింపజేసిందని అన్నారు. దీంతో తమ దగ్గర పైసలు లేకుండా అయ్యాయని, పార్టీ నిధుల కొరత ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు..

ఈ మేరకు ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్తంభింపజేసింది. బ్యాంకు అకౌంట్లలో ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బు ఉంది. దానిని ఫ్రీజ్‌ చేశారు. ఇప్పుడు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. బీజేపీ మాత్రం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన దాతల వివరాలు బయటపెట్టడానికి బయపడుతున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కదిలిరావాలి. కాంగ్రెస్‌ను గెలిపించాలని అవసరం ఏర్పడింది' అంటూ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Delhi: సుప్రీంకోర్టు కుక్ కూతురుకు US స్కాలర్‌షిప్‌.. CJI చంద్రచూడ్ ఏం చేశారంటే!

పన్ను బకాయి వివాదం..

ఇక రూ.100 కోట్ల ఆదాయపు పన్ను బకాయి వివాదంలో కాంగ్రెస్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈ మొత్తం వసూలుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుపై స్టే విధించడానికి ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) నిరాకరించింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించకపోవడంతో ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#bank-money #bjp #mallikarjuna-kharge
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe