Hyderabad : బీజేపీ(BJP) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం బీజేపీ కార్యలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నాయకులకు మతిబ్రమించిదన్నారు. కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు రిజర్వేషన్ ఎత్తేస్తామని మాట్లాడుతున్నారన్నారు. కుర్చీ కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, బ్రిటిష్ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాన్ని కాంగ్రెస్ బాగా వంట పట్టించుకుందన్నారు. అంతేకాదు దేశాన్ని విభజించు పాలించు అనే నీతిని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇటలీ పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అధికారం కోసం కాంగ్రెస్ గడ్డి తింటాది..
ఈ మేరకు ఏ ప్రాతిపదికన ముస్లిం రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. గతంలో ముస్లిం రిజర్వేషన్స్ పెంచాలని చూశారు. సిగ్గు లేకుండా జమ్మూలో జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఆర్టికల్ 370 కారణంగా 42వేల మందిని పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ గడ్డి తింటాది. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని చెప్తే నమ్మే వారెవరూ లేరు కుట్ర పూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ(Telangana) లో బీసీలా రిజర్వేషన్ కు గండి కొడుతుంది ఎవరు? దీనికి రేవంత్, రాహూల్, సోనియా గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం బీసీలకు అన్యాయమన్నారు. ఇందులో 31 మంది ముస్లింలు ఉన్నారు. ముందు వీటిని రద్దు చేసి మాట్లాడాలి. కుటుంబ పాలన ఉండాలని రాజ్యాంగంలో ఉందా? సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగ కోరు రాజకీయాలు చేస్తూ.. నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కనుచూపు మేరలో కూడా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు, అవినీతి పరులకు, కుటుంబ పార్టీలకు పెద్ద పీట వేస్తుందన్నారు. మన్మోహన్ హయాంలో ప్రభుత్వ విద్య సంస్థల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచన చేసింది నిజాం కదా? అని ప్రశ్నించారు. GHMC ఎన్నికల్లో 1/3 (150 లో 50 సీట్లు ) బీసీ లకు కేటాయించామని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Renu Desai: చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూశా.. బీజేపీ అభ్యర్థిపై నటి ప్రశంసలు!
రాజ్యాంగాన్ని శక్తివంతంగా చేశాం..
అలాగే తాము రాజ్యాంగాన్ని శక్తివంతంగా చేశాం తప్పా.. అవహేళన చేయలేదని చెప్పారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టలేదన్నారు. అంబేడ్కర్ నివసించిన ఇల్లు, చదువుకున్న ప్లేస్ వంటి వాటిని పంచ తీర్తలుగా తాము తీర్చిదిద్దామని చెప్పారు. ఇక పీవీ నరసింహారావు మరణిస్తే సోనియా ఆయన పార్థీవ కూడా చూడలేదు. అందరి ప్రధానులకు ఢిల్లీలో ఘాట్స్ ఉన్నాయి. పీవీకి ఎందుకు లేదని అడిగారు. పీవీకి భారతరత్న ఇచ్చి ఆయన గౌరవాన్ని పెంచాం. మేము వచ్చాక ebc రిజర్వేషన్లు తీసుకొచ్చాం. కాంగ్రెస్ ఇచ్చిన గారెడీల గ్యారంటీలపైన చార్జీ షీట్ వేయాలని డిమాండ్ చేశారు.
భారతీయ సంస్కృతికి వ్యతిరేకం..
ఇక ముస్లిం రిజర్వేషన్ లు బరా బార్ ఎత్తేస్తామన్నారు. దీనిపై రాష్ట్ర హై కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. అంబేడ్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే కుట్ర చేసి ఆయన్ని ఓడించారని గుర్తు చేశారు. వయసు అయిపోలేదని చెప్పడానికే రాహూల్ గాంధీ టీ షర్ట్ ధరిస్తారన్నారు. ఇక మన ఇంట్లోకి వచ్చి మన ఆస్తులను కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. సంపాదించిన ఆస్తులను పిల్లలకు చెందకుండా తీసుకుంటామని చెప్పడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. కేసిఆర్ కు అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయన ఫార్మ్ హౌస్ లో ఉండటమే బెటర్. ఒట్లు పెడితే ఓట్లు రావు రేవంత్. ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలిసి పోయిందంటూ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు.