TS BJP : రైతు భరోసాకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.. రచన రెడ్డి ఫైర్!

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి. తబ్లీగి జమాత్ ను ప్రోత్సహిస్తున్నారంటే ఉగ్రవాదానికి గేట్లు తెరిచినట్లే అని అన్నారు. ఈ సంస్థకు నిధులు ఎలా ఇచ్చారని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

TS BJP : రైతు భరోసాకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.. రచన రెడ్డి ఫైర్!
New Update

BJP Spokesperson Rachana Reddy : కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి(Rachana Reddy). కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీ అసలైన రంగు బయట పడిందని అన్నారు. ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు చేశారో.. మనం చూశామని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఓట్లు దండుకున్నారని విమర్శించారు. మైనారిటీ వెల్ఫైర్ ద్వారా తబ్లీగి జమాత్ కు నిధులు వెళ్లాయని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉన్న తబ్లీగి జమాత్ కు 3 కోట్లు నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.

ALSO READ:  మొత్తం కరోనానే చేసింది.. అసెంబ్లీలో హరీష్ రావు!

తబ్లీగి జమాత్ కు వక్ఫ్ బోర్డు ద్వారా డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. తబ్లీగి జమాత్ ను ఇస్లాం జన్మ స్థలమైన సౌదీ అరేబియా దేశం కూడా బ్యాన్ చేసిందని గుర్తు చేశారు. ఈ సంస్థ టెర్రరిజంను ప్రోద్బలం చేస్తుంది అని బ్యాన్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా తబ్లీగి జమాత్ కు నిధులు ఎలా కేటాయిస్తారని కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ కూడా చేయకుండా 3 కోట్లు ఎలా ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఎంఐఎం నేతలు ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగుతారని చురకలు అంటించారు.

ALSO READ: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే!

ఆరుగురు సీనియర్లను కాదని ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను నియమించడం వెనుకున్న కారణం ఏంటి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏమీ తెలుసుకోకుండా 3 కోట్ల నిధులు ఎలా కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 3 కోట్లను వాపస్ తీసుకోవాలని అన్నారు. ఈ సంస్థ మూలాలను తెలుసుకోండి.. ఆ తర్వాత నిధులు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని పేర్కొన్నారు. తబ్లీగి జమాత్ ను ప్రోత్సహిస్తున్నారంటే ఉగ్రవాదానికి గేట్లు తెరిచినట్లే అని అన్నారు. ఈ సంస్థకు నిధులు ఎలా ఇచ్చారు? రైతు భరోసాకు ఎందుకు ఇవ్వలేదు అని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

#rachana-reddy #telugu-latest-news #bjp #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe