బిల్కీస్ భానో... మహిళా రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి...! రక్షా బంధన్ రోజు బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు బీజేపీ నేతలు రాఖీ కట్టాలని ప్రతిపక్షాలు సూచించాయి. ఈ రోజు రక్షా బంధన్ అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు, మణిపూర్ మహిళలకు బీజేపీ నేతలు రాఖీలు కట్టాలన్నారు. వాళ్లంతా దేశంలో సురక్షితంగా వున్నామని ఫీల్ కావాలని చెప్పారు. అందుకే తామంతా కలిసి వచ్చామన్నారు. ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించారని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. By G Ramu 30 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి రక్షా బంధన్ రోజు బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు బీజేపీ నేతలు రాఖీ కట్టాలని ప్రతిపక్షాలు సూచించాయి. విపక్ష ‘ఇండియా’కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మొత్తం 28 పార్టీలు పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రక్షా బంధన్ అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు, మణిపూర్ మహిళలకు బీజేపీ నేతలు రాఖీలు కట్టాలన్నారు. వాళ్లంతా దేశంలో సురక్షితంగా వున్నామని ఫీల్ కావాలని చెప్పారు. అందుకే తామంతా కలిసి వచ్చామన్నారు. ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించారని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. also read:ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..!! ముంబై సమావేశంలో పలు కీలక అంశాల గురించి విపక్షాలు చర్చించనున్నాయి. ముఖ్యంగా సీట్ల పంపిణీ, ఎజెండా గురించి చర్చించనున్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఈ సమావేశంలో 11 మంది సభ్యులతో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. ఆ కోర్డినేషన్ కమిటీలో ఏవరెవరు ఉంటారు... కూటమికి కన్వీనర్ గా ఎవరు ఉండాలనే విషయాలపై తదుపరి సమావేశంలో చర్చించనున్నట్టు గత సమావేశంలో ఆయన వెల్లడించారు. అదే సమావేశంలో విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టారు. ఇక నుంచి యుద్దం ఎన్డీఏ, ఇండియా మధ్య వుంటుందన్నారు. ఈ పోరు మోడీకి ఇండియాకు మధ్య పోరు అని రాహుల్ గాంధీ అన్నారు. also read:విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత… తెరపైకి కొత్త పేరు….! #bjp #raksha-bandhan #india #bilkis-bano-case #udhav-thakre #rakhi #woman-wrestlers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి