Rajya Sabha Elections: 14 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీజేపీ బీజేపీ అధిష్ఠానం పద్నాలుగు మంది రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురిని, బిహార్ నుంచి ఇద్దరిని, కర్ణాటక, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. By B Aravind 11 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BJP Rajya Sabha Election Candidate List: బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పద్నాలుగు మంది రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నుంచి ఏడుగురిని, బిహార్ నుంచి ఇద్దరిని, కర్ణాటక, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభకు అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి డా.సుధాన్షు త్రివేది, నవీన్‌జైన్, ఆర్‌పీఎన్ సింగ్, సాధనాసింగ్, డా సంగీత బల్వంత్, తేజ్‌వీర్ సింగ్, అమర్‌పాల్ మౌర్యాలను అభ్యర్థులగా ఖరారు చేస్తూ జాబితాను ప్రకటించింది. Also Read: 2014 నుంచి బీజేపీ నేతలపై ఈడీ చర్యలు లేవు: శరద్ పవార్ బిహార్ నుంచి డా.భీంసింగ్, ధర్మ్‌శీల గుప్తాలను ఎంపిక చేసింది. ఇక హర్యానా నుంచి సుభాష్ బరాలా, ఉత్తరాంఖండ్ నుంచి మహేంద్ర భట్, వెస్ట్ బెంగాల్ నుంచి సామిక్ భట్టాచార్య, ఛత్తీస్‌గఢ్ నుంచి దేవేంద్ర ప్రతాప్‌సింగ్, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాంశలను ఖరారు చేసింది. ఇదిలాఉండగా.. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదలైన సంగతి తెలిసిందే. 15వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. అలాగే 16న నామినేషన్ల పరిశీలన, 20న విత్ డ్రాకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇక ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో (AP) 3, తెలంగాణలో (Telangana) 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. Also Read: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం #national-news #rajya-sabha-elections #latest-telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి