BJP: బీజేపీ లోక్‌సభ ఎన్నికల నాలుగో జాబితా విడుదల..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ నాలుగో జాబితా విడుదల చేసింది. పుదిచ్చేరిలో ఒకస్థానం, తమిళనాడులో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తమిళనాడు విధురనగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా నటి రాధిక శరత్ కుమార్‌ను కూడా ప్రకటించింది కమలం పార్టీ.

New Update
BJP: 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించిన బీజేపీ

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ నాలుగో జాబితా విడుదల చేసింది. పుదిచ్చేరిలో ఒకస్థానం, తమిళనాడులో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తమిళనాడు విధురనగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా నటి రాధిక శరత్ కుమార్‌ను కూడా ప్రకటించింది కమలం పార్టీ.

publive-image

Also Read: వైద్యశాస్త్రంలో అద్భుతం.. హెచ్‌ఐవీకి చికిత్స

వరంగల్ టికెట్‌ ఆయనకే 

అయితే బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ప్రకటించగా.. రెండో జాబితాలో 72 మంది పేర్లను ఖారారు చేసింది. ఆ తర్వా మూడో జాబితాగా 9 మంది అభ్యర్థులను.. తాజాగా నాలుగో జాబితాలో 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.అలాగే తెలంగాణ నుంచి ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే వరంగల్, ఖమ్మం ఎంపీ సీట్ల అభ్యర్థులను బీజేపీ ఇంకా ప్రకటించలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్‌ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

అభ్యర్థులను మార్చే ఛాన్స్ 

మరోవైపు ఖమ్మం టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మాజీ సీఎం జలగం వెంగళరావు కొడుకు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. కానీ పోటీకి మరో బీఆర్‌ఎస్‌ ఎంపీ ఆసక్తి చూపడంతో ఆయనకే ఈ సీటు దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఖరారైన నల్లగొండ ఎంపీ అభ్యర్థితో పాటు ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరగే ఛాన్స్ ఉందని ప్రచారాలు జరుగుతున్నాయి.

ఇదిలా లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీయే కూటమికి 400 ఎంపీ సీట్లు.. అందులో బీజేపీకి 370 సీట్లు రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దే దించే దిశగా ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రజలు కేంద్రంలో ఎవరికి అధికార పగ్గాలు అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచిచూడాల్సిందే

Also Read: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..చివరకు అదే ఆరోపణలతో అరెస్ట్..కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే..

Advertisment
తాజా కథనాలు