బీజేపీలోనే వివేక్.. లక్ష్మణ్ సంచలన ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ రెండు ఒకటే అని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్‌ అన్నారు. వివేక్‌ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతున్నారని..ఆయన మీద చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.

New Update
బీజేపీలోనే వివేక్.. లక్ష్మణ్ సంచలన ప్రకటన

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాలా ముందు ఉందని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. వివేక్‌ వెంకటస్వామి పై గత ఆరు నెలల నుంచి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన వివరించారు. వివేక్‌ బీజేపీలోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ గా ఆయన తన బాధ్యతలను చక్కగా నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. వివేక్‌ పై జరుగుతున్న ప్రచారాన్ని గత ఆరు నెలలుగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్‌ -కాంగ్రెస్‌ రెండు కూడా ఒకే గూటి పక్షులని తెలిపారు. ఆ రెండు పార్టీలది ఒకటే డీఎన్ఏ అన్నారు.

Also read: వినియోగదారులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి, టమాటా ధరలు..రోజురోజుకి పైకి!

కుటుంబ వారసత్వ రాజకీయాలకు పర్యాయ పదాలు ఆ రెండు పార్టీలని విమర్శించారు. కాంగ్రెస్‌ , బీఆర్‌ఎస్‌ రెండు కలిసే రాష్ట్రంలో గేమ్‌ ఆడుతున్నాయన్నారు. బీజేపీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు .కాంగ్రెస్‌ కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని ఆయన అన్నారు.

మతోన్మాదంతో రెచ్చిపోయే ఎంఐఎంకు పాలు పోయోద్దన్నారు. గ్యారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ హామీలను చూసి మోసపోవద్దని తెలిపారు. కాంగ్రెస్‌ కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు తీసుకుని వస్తుందని లక్ష్మణ్‌ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు తెలంగాణ, రాజస్థాన్‌ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌ చేస్తామని తెలిపారు.

బీసీ సీఎం ప్రకటన పై మంచి స్పందన వస్తుందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. విచారణ జరిపించి బాధ్యులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇక పోతే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట మార్చిన తీరు గురించి ఆయన్నే ప్రశ్నించాలని అన్నారు.

జనసేన అధినేత పవన్‌ విదేశీ పర్యటన ముగించుకుని రాగానే ఎక్కడెక్కడ పోటీ అనే దాని మీద స్పష్టత వస్తుందని తెలిపారు. జనసేనతో పొత్తు ఉంటుందని ఆయన వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు