Telangana Politics: ఉరికించి కొడతాం.. బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్..!

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ఉగ్రరూపం దాల్చారు. ఉరికించి కొడతామంటూ తనదైన శైలిలో బీఆర్ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాడి చేయడంపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఆయన.. బీఆర్ఎస్ నేతలకు ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలకు సంస్కారం ఉందని, అది పక్కన పెడితే బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్.

New Update
Telangana Politics: ఉరికించి కొడతాం.. బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్..!

Bandi Sanjay Serious Warning to BRS: కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌(Kuna Srisailam Goud)పై బీఆర్ఎస్‌(BRS) ఎమ్మెల్యే వివేకానంద దాడి చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay Kumar) తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు భయపడరని, సంస్కారం పక్కన పెడితే ఉరికించి కొడతామంటూ బీఆర్‌ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం నాడు ఓ ఛానెఎల్ ఇంటర్వ్యూలో చర్చ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద దాడికి పాల్పడ్డారు. దాంతో ఇవాళ శ్రీశైలం గౌడ్‌ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు బండి సంజయ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

'బీజేపి కార్యకర్తలకు సంస్కారం ఉంది. మేము కూడా సంస్కారం పక్కన పెడితే ఉరికిచ్చి కొడతాం. బీజేపీ కార్యకర్తలు భయపడరు. పదేళ్ల నుంచి తెలంగాణ ప్రజల ఊసురు పొసుకుంటున్నారు. ఈ ఏరియా మిని హైదరాబాద్. కుబ్దుల్లాపుర్ ప్రజలు ఆలోచించాలి. పేదల కోసం పోరాడే వ్యక్తిని ఎన్నుకోవాలి. కండ కవారం తలకెక్కి కూన శ్రీశైలంపై దాడికి పాలడ్డారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కబ్జాలకు పాల్పడే, ప్రజల సొమ్మును దోచుకునే వ్యక్తికి ఓటేస్తారా? లేదా ప్రజల కోసం పోరాడే కూన శ్రీశైలం గౌడ్కి ఓటేస్తారా? ప్రజలు ఆలోచించాలి. ఈ నియోజకవర్గ తీర్పు కోసం రాష్ట్రం అంతా ఎదురుచూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించాలని అధికార పార్టీ చూస్తోంది. దాడి చేసిన వ్యక్తిని ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి.' అని బండి సంజయ్ అన్నారు.

ఇదికూడా చదవండి:పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

రాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో ఓ టీవీ ఛానల్‌ చర్చా వేదికను నిర్వహించింది. ఈ వేదికలో కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూఆక్రమణ విషయంపై కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ఆరోపణలు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ పై దాడి చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు.

కాగా, శ్రీశైలంగౌడ్‌పై వివేకానంద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ నేతలు. ఈ దాడి దారుణమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సైతం ఈ దాడిని ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ బండి సంజయ్ నేరుగా కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి వెళ్లి, ఆయన్ను పరామర్శించారు.

ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Advertisment
తాజా కథనాలు