Bandi Sanjay : కవిత బెయిల్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. త్వరలో బీజేపీ కవితను బయటకు తీసుకొస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అలా మేము బెయిల్ ఇస్తే.. హైకోర్టు , సుప్రీం కోర్టు ఎందుకు అని ప్రశ్నించారు. న్యాయస్థానాలు వాటిపని అవి చేసుకుంటాయని చెప్పారు.

New Update
Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ!

Bandi Sanjay Comments On Kavitha Bail : బీజేపీ (BJP) నేత, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మీడియాతో చిట్ చాట్ చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) అవుట్ డేటెడ్ పార్టీ అని అన్నారు.. ఆ పార్టీతో చర్చలే లేవు అని స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్‌ అని కొట్టిపారేశారు. కవితకి బెయిల్ ఇవ్వడానికి కేసీఆర్ పార్టీని విలీనం చేస్తున్నారనేది అవాస్తవం అని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి మేం బెయిల్ ఇచ్చామా?.. మేం బెయిల్ ఇస్తే.. సుప్రీం కోర్టు, హైకోర్టులు ఎందుకు మరి? అని ప్రశ్నించారు.

Also Read : పార్టీ మారినా పెత్తనం మేఘాదే.. ఆ సంస్థను బ్లాక్ లో పెట్టాల్సిందే!: ఏలేటి సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు