MP Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ మంత్రి కాపాడుతున్నాడు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

TG: మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌తో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.

BJP MP Bandi Sanjay: ఆరు గ్యారెంటీలతో మోసగించిన దొంగల బ్యాచ్‌ కాంగ్రెస్‌.. బండి సంజయ్‌ చురకలు
New Update

MP Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌తో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఈ కేసులో పోలీసుల అధికారుల ప్రమేయం ఉండదని.. నాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ తతంగామంతా జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్‌ కేసును నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ALSO READ: కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్

కేసును నీరుగార్చేందుకు మంత్రి యత్నాలు..

సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని.. ఈ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ కేసును పక్కదారి పట్టించి, నిందితులను రక్షించేందుకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి యత్నిస్తున్నారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తీవ్రమైన అంశమని, ఈ విషయంలో కాంగ్రెస్‌ సర్కారు తాత్సారం చేస్తోందన్నారు. తనతో సహా సీఎం రేవంత్‌, మాజీమంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని తెలిపారు.

317 జీవో, టీఎస్‌పీఎస్సీ లీకేజీ విషయంలో పోరాడుతున్నందుకు నన్ను అరెస్టు చేశారని, బీఆర్‌ఎస్‌ హయాంలో మియాపూర్‌ భూకుంభకోణం, నయీం, డ్రగ్స్‌ కేసు, టీఎస్‌పీఎస్సీ లీకేజీపై సిట్‌ విచారణ తాత్సారం జరిగినట్లే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న నిందితులను రక్షించేందుకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి యత్నిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ మాదిరిగానే రేవంత్‌రెడ్డి పాలన ఉందని.. బీఆర్‌ఎస్‌ పాలనకు.. కాంగ్రెస్‌ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

#mp-bandi-sanjay #ktr #kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి