MP Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌తో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఈ కేసులో పోలీసుల అధికారుల ప్రమేయం ఉండదని.. నాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ తతంగామంతా జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..MP Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ మంత్రి కాపాడుతున్నాడు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
TG: మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌తో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
Translate this News: