ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు వారి వారి అభిప్రాయాలను కిషన్‌రెడ్డికి తెలిపారు. మాకు ఏ పని అప్పగించినా సరే.. దానిని పూర్తి చేసేందుకు అన్నివేళలా మేం సిద్ధంగా ఉన్నామంటూ వారు పేర్కొన్నారు. అయితే.. ఎమ్మెల్సీ కవిత విషయంలో చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను ముందే ప్రకటిస్తే బాగుంటుందని బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు కిషన్‌రెడ్డి ముందు వెల్లడించారు.
మేమందరం పార్టీతోనే..
బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు చెప్పిన దానికి సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ ఇలా స్పందిస్తూ.. ఇకపై మేము మేమందరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే వారు నియోజకవర్గాల్లో పనిచేసుకోండి.. ప్రజాసమస్యలపై(Public Issue) పోరాటం చేయండి.. మీరు ఏది చెప్పాలనుకున్న మాకు చెప్పండి.. లేదా కిషన్ రెడ్డి అందుబాటులో లేని సమయంలో ఇంద్రసేనారెడ్డిని(Indra sena reddy) కలువొచ్చని ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ తెలిపారు.
బీజేపీ శ్రేణులు వ్యూహం
దీంతో.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకునేలా బీజేపీ శ్రేణులు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అనుసరించాల్సిన 100 రోజుల (100 Days) కార్యచరణపై కమలం పార్టీ (BJP)నేతలు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్(BRS)ను ఎదుర్కొనేందుకు రాబోయే తెలంగాణ ఎన్నికల (Telangana Elections)నేపథ్యంలో రాజకీయ కార్యాచరణను(Political Activity)రూపొందించేందుకు అందరం కలిసికట్టుగా పని చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు.
తెలంగాణ బీజేపీకి కొత్త టెన్షన్
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీకి మరో కొత్త టెన్షన్(Tension)కలవరపెడుతోంది. బీజేపీ నేతల సమావేశాలకు ఏపీ నేతలు (Ap Leaders)రావడంతో తెలంగాణ నేతలు (Telangana Leaders) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)రాకను బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi)వ్యతిరేకించారు. కిరణ్ కుమార్ మాకొద్దు అని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక నేతలు మరో చంద్రబాబు(Chandrababu)లాగా భావిస్తున్నారు.