రాజస్థాన్ లో ఆధిక్యంలో బీజేపీ..

అందరూ అనుకున్నట్టుగానే రాజస్థాన్ల ఓ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అనిపిస్తోంది. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం అక్కడి ప్రజలు ఈసారి కూడా గవర్నమెంట్ ను మార్చాలని అనుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన దగ్గర నుంచీ బీజేపీనే ఆధిక్యంలో ఉంది.

రాజస్థాన్ లో ఆధిక్యంలో బీజేపీ..
New Update

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాజస్థాన్‌లో బీజేపీ 101 సీట్లతో సగం మార్కును దాటగా, కాంగ్రెస్ 78 సీట్లతో వెనుకబడి ఉంది. ఇక్కడ బీజేపీ మొదటి నుంచే ఆధిక్యం చూపిస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీలో 199 సీట్లు ఉన్నాయి. ఇందులో 100 మార్కు దాటిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు.

రాజస్థాన్ లో ప్రతీ టర్మ్ కు పార్టీ మారడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని బట్టి గత టర్మ్‌లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందుకే ఈసారి బీజేపీ వస్తుందని చాలా గట్టి నమ్మకంగా ఉంది. దానికి తగ్గట్టే ఇప్పటి వరకూ ఫలితాలు కూడా3 బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో బీజేపీకి 38.77 శాతం, కాంగ్రెస్‌కు 39.30 శాతం ఓట్లు వచ్చాయి. రాజస్థాన్‌ బీజేపీ చీఫ్‌ సీపీ జోషి మాట్లాడుతూ.. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. రాజస్థాన్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు బీజేపీని పూర్తి మెజారిటీతో ఆశీర్వదించారు. దుష్పరిపాలన మరియు అన్యాయం కోల్పోతాయి.  సుపరిపాలన మరియు న్యాయం గెలుస్తుంది అన్నారు.

కానీ సీఎం గెహ్లోత్‌ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్‌ యువ నేత సచిన్‌ పైలట్‌ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు.

#congress #bjp #elections #rajasthan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe