BJP: చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం బీజేపీలో లొల్లి..

చేవెళ్ల పార్లమెంట్‌ టికెట్‌ కోసం ఎవర్ని లాబియింగ్ చేసినా చివరికి బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని కొండా విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ-బీజేపీ అలియన్స్ చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేసిన విరేందర్ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

BJP: చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం బీజేపీలో లొల్లి..
New Update

లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఎంపీ టికెట్ల కోసం పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలోని చేవెళ్ల పార్లమెంట్‌ టికెట్‌ కోసం నేతల లాబీయింగ్ అనే అంశం చర్చనీయాంశమవుతోంది. ఎవరెవర్ని లాబియింగ్స్ చేసినా కూడా చేవేళ్ల నుంచి బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని కొండా విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా గెలుపొందారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వర రెడ్డి. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని కూడా వీడి చివరికి 2020లో బీజేపీలోకి చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో పట్టుబట్టి మరి తన వర్గీయులకు కొండా టికెట్లు ఇప్పించుకున్నారు. మరోవైపు దేవేందర్ గౌడ్ కుమారుడు విరేందర్ గౌడ్ కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నారు.

Also Read: మహిళల ఫ్రీ జర్నీకి ఆ కార్డు చెల్లదు.. సజ్జనార్ కీలక ప్రకటన!

2014లో టీడీపీ-బీజేపీ అలియన్స్ చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేసిన విరేందర్ గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. అయితే మొన్న ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఆశించి భంగపడ్డారు విరేందర్ గౌడ్. అయితే చేవెళ్ల లేదా మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో ఏదైన ఒక టికెట్ ఇవ్వాలని ఆయన హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా.. గత పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి నుంచి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్ధన్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Also read: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్

మరోవైపు కేంద్రమంత్రి సొంత గ్రామం కూడా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఉంది. అయితే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కిషన్ రెడ్డి సైతం ఆచి తుచిగా అడుగులు వేసి నిర్ణయం తెలిపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

#chevella-mp #telugu-news #chevella #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe