బండి సంజయ్ మాట్లడుతూ.. బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్ గెలిచినా ఉప ఎన్నికలు గ్యారంటీ అని బండి అన్నారు. బీజేపీ సుస్థిర పాలన ఏర్పాటు చేసే వరకు ఆగదని బండి సంజయ్ తెలిపారు. ప్రజల గుండెల్లో బీజేపీ పువ్వు వికసించి ఉందన్నారు. కేటీఆర్ షాడో సీఎం.. ఆయన కింద ప్రతి మండలానికి ముగ్గురు సామంత రాజులు ఉన్నారని ఆరోపించారు. పోలీసులకు మేము వ్యతిరేకం కాదు.. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని బండి కోరారు. బతుకమ్మ చీరలతో పదిమందిని బడా బాబును చేశాడని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా కార్మికులను చేస్తానని మరిచారని ఆయన విమర్శించారు.
ఇది కూడా చదవండి: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కళ్లను టెస్ట్ చేయించుకోవాల్సిందే
తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల నిరుద్యోగుల కోసం నేను కొట్లాడా.. టెన్త్ పేపర్ లీకేజ్ పేరిట జైలుకు పంపారని బండి సంజయ్ మండిపడ్డారు. పెన్షన్ దారులకు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వస్తే బీఆర్ఎస్‌కు ఓటెయ్యండని బండి సంజయ్ తెలిపారు. ఉద్యోగులకు జీతాలు రావాలంటే బండి సంజయ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తానని ప్రకటిస్తే పార్టీలో పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని ఎద్దేవా చేశారు. కాబోయే సీఎం కేటీఆర్ అయితే సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. సిరిసిల్లలో ఎంతమంది చేనేత కార్మికులు, రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నావో శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బీసీలకు గుణం లేదని ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటే ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో సైలెంట్‌గా ఓటింగ్ జరుగుతుంది.. రాణి రుద్రమ ఎమ్మెల్యే కాబోతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోంది
మరోవైపు ఎంపీగా గెలిపిస్తే బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్ దుష్ప్రచారాన్ని చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లను బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రానివేనని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ, ఆర్వోబీ , రోడ్లు, డ్రైనేజీ, టాయిలెట్లు సహా కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని బండి చెప్పారు. ఈ సందర్భంగా డేట్, టైం ఫిక్స్ చేయ్ అని గంగుల కమలాకర్‌కు సవాల్ విసిరారు. అకౌంట్స్ తీసుకుని రా..? నేను ఎంపీగా గెలిచాక కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కలతో సహా వస్తా. చర్చిద్దాం. సిద్ధమా..? అంటూ బండి సజయ్ ప్రశ్నించారు.