Chandrababu: చంద్రబాబు అరెస్ట్ అవుతారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హాట్ కామెంట్స్!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటిసులు ఇవ్వడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ నిర్మాణ సంస్థ నుంచి రూ. 118 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబుకు నోటిసులు అందాయి. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్య కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశామే లేదని..ఇదంతా వైసీపీ నేతల కుట్ర అని ఆరోపించారు.

New Update
Chandrababu: చంద్రబాబు అరెస్ట్ అవుతారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హాట్ కామెంట్స్!

Chandrababu IT Notice Row: నిర్మాణ సంస్థ నుంచి రూ. 118 కోట్ల కిక్‌బ్యాక్‌లు అందుకున్నారనే ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన తర్వాత ఏపీలో బీజేపీకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థంకాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా నోటిసులు ఇవ్వారంటున్నారు. కేంద్రం నుంచి ఐటీ శాఖలోని ఉన్నతాధికారులకు క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే ఆదాయపు పన్ను శాఖ నోటిసులు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వైసీపీ(YCP)కి ప్లస్‌గా మారిందన్నది విశ్లేషకులు మాట.

మాట్లాడరేం?
టీడీపీ అధినేతపై వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. ఐటీ నోటిసులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు కానీ.. ఆయన పార్టీ నేతలు కానీ దీనిపై నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ (BJP), కమ్యూనిస్టులు, జనసేన (Janasena) పార్టీలు కూడా మౌనాన్ని వహించడంపై వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించి రూ. 371 కోట్ల స్కామ్‌కి చంద్రబాబు పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) విచారణ ప్రారంభించింది. జగన్ ప్రభుత్వం తనను అరెస్టు చేయవచ్చని లేదా తనపై దాడికి ఆదేశించవచ్చని పరోక్షంగా ఐటీ నోటీసును ప్రస్తావిస్తూ చంద్రబాబు ఓ కామెంట్ చేశారు. 'నేను ఏ తప్పు చేయలేదు.. అందుకే నేను భయపడను' అని చెప్పారు. ఐటీ నోటీసుల గురించే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.

Also Read: రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన

మరోవైపు ఈ ఎపిసోడ్‌లో ఏపీ బీజేపీ ఆచితూచీ అడుగులువేస్తోంది. ఏపీ బీజేపీలోని కొంతమంది టీడీపీ అధినేతను సపోర్ట్ చేస్తున్నారు. 'ఇది తీవ్రమైన సమస్య కాదు.. సాధారణ విషయం' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటి చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఏపీ బీజేపీ చంద్రబాబు విషయంలో ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ (CM Jagan) ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఆయన.. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశామే లేదన్నారు. ఇది కేవలం వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని.. ఇన్‌కమ్ ట్యాక్స్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చాన్స్ లేదన్నారు. ఈ నోటీసు వైసీపీ ప్రభుత్వ కుట్ర అని అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు సత్యకుమార్‌ చెప్పారు.

ALSO READ: తెలంగాణ మహిళలకు మరో శుభవార్త అందించిన ప్రభుత్వం

Advertisment
తాజా కథనాలు