Amit Shah Telangana Tour: కేంద్ర మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule 2023) విడుదల తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారి వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఆయన ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రాత్రి 7:40 గంటలకు ఐటీసీ కాకతీయలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. 6.20 నుంచి 7.20 గంటల వరకు అమిత్ షా రాష్ట్రంలోని మేధావులతో భేటీకానున్నారు అమిత్ షా.
ఇది కూడా చదవండి: BJP: బీజేపీకి బిగ్ బూస్ట్.. ఈటల, కిషన్‌రెడ్డి అధ్వర్యంలో భారీ చేరికలు..!
రేపు అమిత్ షా (AmitShah) పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది..
- మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా వస్తారు.
- అక్కడి నుంచి 02.35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ కు..
- మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ లో మీటింగ్
- 4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు..
- 5.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు..
- 05.20 నుంచి 6 వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం
- 6:20 నుంచి 7:20 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్ కు..
- 7:40 నుంచి ఐటీసీ కాకతీయలో ముఖ్య నేతలతో సమావేశం
- 9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్న షా