/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Bandi-Sanjay-Kumar-visits-BJP-candidate-Srisailam-Goud-in-Kutbullapur-jpg.webp)
Bandi Sanjay Kumar Nomination: తెలంగాణలో బీజేపీ(BJP) నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సోమవారం నాడు బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్, రాజాసింగ్ హాజరుకానున్నారు. ఇక సోమవారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బండి సంజయ్. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి కమాన్, వెంకటేశ్వర టెంపుల్, రాజీవ్ చౌక్, కోర్టు చౌరస్తా, శివటాకీస్, జ్యోతి నగర్, రాంనగర్, గీతాభవన్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బీజేపీ కార్యకర్తలు.
గెలిపించండి..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చేసిన పోరాటాలు, కేంద్రం నుండి తీసుకొచ్చిన నిధులను ప్రస్తావిస్తూ రూపొందించిన కరపత్రం ప్రజలను ఆకర్షిస్తోంది. ‘నేనెప్పుడూ మీ బిడ్డనే.. నిండు మనసుతో దీవించండి’’ పేరుతో రూపొందించిన 2 పేజీల కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు.
‘నేనెప్పుడూ మీ బిడ్డను.. మీ కళ్ల ముందు పెరిగిన. మీ కాళ్ల మధ్యన తిరిగిన. మీ దీవెనలతోనే ఇంతటి వాడినయ్యా. కరీంనగర్ గల్లీలో తిరిగిన సామాన్యుడిని దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పించారు. పోరాటాల, చైతన్యాల కరీంనగర్ గడ్డపై పుట్టిన బిడ్డగా దేశం కోసం, ధర్మం కోసం కాషాయ జెండా పట్టుకుని ప్రజల పక్షాన పోరాడిన’ అంటూ కరపత్రాన్ని రూపొందించారు. అంతేకాకుండా ఎంపీగా గెలిపించాక కరీంనగర్ అభివృద్ధి కోసం తాను చేసిన కార్యక్రమాలు, తెచ్చిన నిధులతోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల పక్షాన చేసిన పోరాటాలను, జైలుకు వెళ్లిన సందర్భాలను కరపత్రంలో ప్రస్తావించారు. కాగా, ఈ కరపత్రంపై ప్రజల్లో సానకూల చర్చ జరుగుతోంది.
Also Read: