PM Modi: రాజ్యాంగం రద్దుపై.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేద్కర్‌ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరని అన్నారు.

PM Modi : 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ డేట్ తో ప్రధానికి ఉన్న సెంటిమెంట్ ఇదే!
New Update

PM Modi: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. దేశ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ విపక్ష పార్టీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేద్కర్‌ కూడా ఇప్పుడు దాన్ని రద్దు చేయలేరని అన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని.. దేశాన్ని బలహీనపరిచేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోందంటూ తీవ్రంగా విమర్శించారు.

Also read: ప్రధాని మోదీ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించిన లోక్‌నీతి సర్వే..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ' మా ప్రభుత్వానికి రాజ్యాంగమే సర్వస్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇప్పుడు వచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ పేరుతోనే మోదీపై దర్భాషలాడుతోంది. పొరుగు దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉండగా.. మన దేశంలో వీటిని నిర్మూలన గురించి విపక్షాలు మాట్లాడటం శోఛనీయం. ఎవరి సూచనల మేరకు విపక్ష కూటమి పనిచేస్తోందని ' అన్నారు.

ఇదిలాఉండగా.. రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే బీజేపీకి భారీ మెజార్టీ రావాలని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని బీజేపీ సర్దిచెప్పుకునే ప్రయత్నాలు చేశాయి. కానీ రాహుల్‌ గాంధీతో పాటు మిగతా విపక్ష నేతలు ఈ అంశాన్నే తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ తీరుపై ప్రధాని మోదీ విమర్శించారు.

Also Read: రామేశ్వరం కేఫ్‌ నిందితులు అరెస్టు..

#telugu-news #pm-modi #national-news #constitution
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe