PM Kisan : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan Yojana) పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ అమలుకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయింది. ఖరీఫ్ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ పథకం కింద మోడీ(PM Modi) ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.6000లను అందిస్తోంది. ఒకేసారి కాకుండా మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
ALSO READ: జగన్ షాక్.. రాజీనామా బాటలో వైసీపీ ఎంపీ?
ఈ మొత్తాన్ని రూ.8 నుంచి 9వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.8000లను నాలుగు వాయిదాలు..9వేలైతే మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో దీనికి సంబంధించి ప్రకటన చేసేందుకు రెడీ అవుతోంది కేంద్రం. ఇక దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని..ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రైతులకు రూ. 12వేలకు పెంచాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...
మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత టర్మ్ లాస్ట్ పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 31వ తేదీన పార్లమెంట్ లో రాష్ట్రపతి(India President) ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 1వ తేదీన 2024-2025కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.
ALSO READ: పెట్రోల్, డీజిల్ పై రూ.10 తగ్గింపు.. కేంద్రం కీలక ప్రకటన?