Bharat Rice: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ రైస్ ద్వారా కిలో బియ్యం రూ.29లకే అందించనుంది. వచ్చే వారం నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశ మార్కెట్‌లో కిలో బియ్యం ధర రూ. 60 నుంచి రూ.120 మధ్య ఉంది.

Bharat Rice: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన
New Update

Bharat Rice: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మోడీ సర్కార్ (Modi Govt) సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కాస్త ఊరట లభించనుంది. రేపటి నుంచి మార్కెట్‌లోకి భారత్‌ రైస్ (Bharat Rice) రానుంది. కిలో రూ.29కే అమ్మాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్ లో 25 కిలోల బియ్యం బస్తా రూ.1600 నుంచి రూ. 1800 వరకు ఉంది. బియ్యం యొక్క క్వాలిటీని భట్టి అమ్మే ధర ఉంటుంది. ప్రస్తుతం దేశ మార్కెట్ లో కిలో బియ్యం ధర రూ. 60 నుంచి రూ.120 మధ్య ఉంది. తాజాగా కేంద్రం తేనున్న భారత్ రైస్ పథకం ద్వారా రూ.29లకే కిలో బియ్యం అనేది సామాన్యుడికి భారీ ఊరట ఇవ్వనుంది.

ALSO READ: త్వరలోనే సీఎం రేవంత్‌ని కలుస్తా.. మల్లారెడ్డి కీలక ప్రకటన.. కాంగ్రెస్‌లోకి జంప్?

ఓట్ల కోసమేనా..?

ఎన్నికలు (Lok Sabha Elections) వస్తున్నాయి అంటేనే ప్రభుత్వాలకు, పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తారు.. వారి సమస్యలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే వారు ఓట్లు వేస్తేనే గా పార్టీలు అధికారంలోకి వచ్చేవి. తాజాగా దేశ రాజకీయాల్లో ఇదే జరిగింది. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలో కొనసాగాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ (BJP Party) భావిస్తుంది. ప్రజలపై హామీల వర్షం కురిపించి.. కొత్త పథకాలు ప్రవేశ పెట్టి అధికారంలో కొనగాలని యోచిస్తోంది.

అందులో భాగంగానే ఈ భారత్ రైస్ పథకం.. కేవలం రూ.29కే కిలో బియ్యం అందించడం. ఎన్నికల సమయం దగ్గర పాడేటప్పుడు బీజేపీకి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా లోక్ సభ ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ పథకాన్ని (PM Kisan Scheme) ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పథకాలు తేవాలి కానీ.. ఓట్ల కోసం కాదని విశ్లేషకులు అంటున్నారు.

ALSO READ: 57 నిమిషాల మధ్యంతర బడ్జెట్…ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది

DO WATCH:

#pm-modi #telugu-latest-news #rice-price #bharat-rice
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe